మతపరమైన అంశాలకు వేరే చోట్లున్నయ్

మతపరమైన అంశాలకు వేరే చోట్లున్నయ్

హిజాబ్​ బ్యాన్​పై విచారణలో సుప్రీం బెంచ్

న్యూఢిల్లీ: రైట్ టు డ్రెస్​ అంటే రైట్​టు నాట్​ డ్రెస్​ కూడానా? అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిజబ్​ బ్యాన్​కు సంబంధించి విచారణ సందర్భంగా లాయర్​ వాదనలను తప్పుబట్టిన బెంచ్​ ఈ కామెంట్​ చేసింది. ఈ విషయాన్ని సంబంధంలేని వైపునకు తీసుకెళ్లొద్దని సూచించింది. కర్నాటక హైకోర్టు విద్యా సంస్థల్లో హిజబ్​ ను బ్యాన్​ చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై బుధవారం బెంచ్, లాయర్​కు మధ్య సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఒక వర్గం మాత్రమే స్కార్ఫ్(హిజబ్)​ను ధరించాలని చెబుతున్నారని, మిగతా అన్ని వర్గాలు కూడా డ్రెస్​ కోడ్​ను పాటిస్తున్నాయని, వారు మేము ఇదే ధరిస్తాం.. అదే వేసుకుంటాం అని చెప్పడం లేదు కదా! అని ప్రశ్నించింది. చాలా మంది స్టూడెంట్లు రూద్రాక్షలు, క్రాస్​ సింబల్ వంటివి ధరిస్తున్నారని కామత్​ చెప్పారు. దీనిపై బెంచ్​ స్పందిస్తూ.. వారు వాటిని చొక్కా లోపల ధరిస్తున్నారని, ఎవరు వాటిని చొక్కా తీసి అతను రుద్రాక్ష వేసుకున్నాడో లేదో చూడరు కదా! అని ప్రశ్నించింది. రైట్​టు డ్రెస్​ అంటే రైట్​టు నాట్​ డ్రెస్​ కాదు కదా! అని పేర్కొంది.  మతపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయని, స్కూల్​లో అందరు విద్యార్థులు ఒకే యూనిఫాం ధరించాల్సి ఉంటుందని బెంచ్​ పేర్కొంది.

27న టైమ్​లైన్​ను నిర్ణయిస్తం

కేంద్రం, ఢిల్లీ సర్కార్​ల అధికార పరిధిపై సుప్రీం

కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల అధికారాల పరిధికి సంబంధించిన వివాదాస్పద అంశంపై విచారణకు సంబంధించి ఈ నెల 27న టైమ్‌‌లైన్‌‌ను నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎలాంటి పేపర్లు లేకుండా ఈ ప్రొసీడింగ్స్​ను నిర్వహిస్తామని, అందుకే ఇదో గ్రీన్​ బెంచ్​ అని జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.