కళ్యాణ్ రామ్ సినిమాకు సంయుక్త సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా?

కళ్యాణ్ రామ్ సినిమాకు సంయుక్త సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా?

కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ సౌత్ హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. రీసెంట్ గా సంయుక్త నటించిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవడమే దీనికి కారణం. అందుకే ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోలు సంయుక్తనే కావాలంటున్నారట. ఇక తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తన తరువాతి సినిమా కోసం సంయుక్త నే ఫీమేల్ లీడ్ గా తీసుకున్నారట. 

కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెవిల్. భారతదేశానికి స్వతంత్రం రాకముందు నాటి కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో కూడా సంయుక్త నే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ లో కళ్యాణ్ రామ్ తో ఆడుతూ పాడుతూ కనిపించింది ఈ కేరళ కుట్టి. ఈ జంట ఇప్పటికే.. బింబిసార సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ జంట జతకడుతుండటంతో.. డెవిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. సంయుక్త ప్రీవియస్ మూవీస్ సార్, విరూపాక్ష సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తమిళ స్టార్ హీరో ధనుష్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర వందకోట్ల మార్క్ ను టచ్ చేశాయి. ఇక ఏ రకంగా చూసినా సంయుక్తా సెంటిమెంట్ సౌత్ హీరోలకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మడి సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అయితే.. కళ్యాణ్ రామ్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ పడినట్లే అంటున్నాయి సౌత్ సినీ వర్గాలు.