ఆ ఒక్కడి కోసం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మారనుందా..?

ఆ ఒక్కడి కోసం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మారనుందా..?

ఆసియా కప్ లో భాగంగా మరి కాసేపట్లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్థాన్ తమ తుది జట్టుని ప్రకటించగా భారత్ విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొంది. ప్లేయింగ్ 11 ని ఎంచుకోవడం తలనొప్పిగా మారిన తరుణంలో ఇప్పుడు మరో కొత్త సమస్య టీమిండియాను కలవరానికి గురి చేస్తుంది. అదేంటో కాదు బ్యాటింగ్ లో ఏ స్థానంలో ఎవరాడతారనే విషయం.  ఇప్పటికే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీలు తమ చర్చనీయాంశంగా మారింది. మరి భారత బ్యాటింగ్ ఆర్డర్ ఇంత గందరగోళంగా మారడానికి కారమేంటో ఇప్పుడు చూద్దాం. 

ఇషాన్ కిషన్ ఏ ప్లేస్ లో ఆడతాడు..?

సీనియర్ ప్లేయర్ రాహుల్ గాయంతో పాకిస్థాన్ మ్యాచ్ కి దూరం కావడంతో ఇషాన్ కిషన్ కి తుది జట్టులో లభించే అవకాశం ఉంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఇషాన్ స్థానం దాదాపు గ్యారంటీ. అయితే ఇప్పుడు అసలు సమస్య కిషన్ ప్లేయింగ్ 11 లోకి వస్తే ఏ స్థానంలో ఆడతాడు?. కిషన్ లాంటి అనుభవం లేని ప్లేయర్ ని మిడిల్ ఆర్డర్ లో ఆడించడం అంత మంచిది కాదని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఈ  నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ తో కలిసి కిషన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తే అప్పుడు గిల్, కోహ్లీ, అయ్యర్ స్థానాలు స్థానాలు కూడా మారాల్సి వస్తుంది. ఆసియా కప్ లాంటి మేజర్ టోర్నీలో ఈ ప్రయోగం చేస్తారా అంటే అంత రిస్క్ తీసుకునేలా కనిపించడం లేదు. అలా అని కిషన్ ని నెంబర్ 5 లో ఆడిస్తే ఒత్తిడిని తట్టుకొని కీలకమైన ఆ స్థానంలో నిలబడగలడా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.