దుబాయ్: దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కుప్పకూలి భారత ఎయిర్ఫోర్స్పైలట్ వింగ్ కమాండర్ నమాన్ష్ శ్యాల్ మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఓ పైలట్ చనిపోయిన తర్వాత కూడా దుబాయ్ ఎయిర్ షోను కొనసాగించడంపై యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మేజర్ టేలర్ ఫెమా హీస్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "పైలట్, అతని సహచరులు, కుటుంబానికి గౌరవ సూచకంగా మేం మా చివరి ప్రదర్శనను రద్దు చేసుకున్నాం. ఈ విషాదకర ఘటన తరువాత ఎయిర్ షో నిలిచిపోతుందని భావించాను. కానీ అలా జరగలేదు. అనౌన్సర్ ఉత్సాహం, ప్రజలు షోను ఎంజాయ్ చేయడం గమనించి షాక్ అయ్యాను. ఇదేనా పైలట్‌కు ఇచ్చే గౌరవం?" అని హీస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
