
అగ్రరాజ్యం అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శనివారం ( మే 10 ) సాయంత్రం సీజ్ ఫైర్ ను ఉల్లంగిస్తూ పాక్ కాల్పులు జరిపినప్పటికీ ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ట్వీట్ చేశారు. ఇరు దేశాలతో కలిసి కశ్మీర్ సమస్య పరిష్కరిస్తానని ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. యుద్ధం వల్ల మరణాలు, విధ్వంసం తప్ప ఏమీ లేవని భారత్, పాకిస్థాన్ అర్థం చేసుకున్నందుకు గర్వంగా ఉందని అన్నారు ట్రంప్.
ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనక అమెరికా పాత్ర ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. భారత్, పాక్ లు ఈ నిర్ణయం తీసుకోకపోతే.. లక్షల మంది అమాయక ప్రజలు చనిపోయి ఉండేవారని అన్నారు ట్రంప్.ఇరు దేశాలతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని.. వెయ్యేళ్ళయినా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఉంటుందంటే... భారత్, పాకిస్థాన్ లతో కలిసి పనిచేస్తానంటూ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు ట్రంప్.
కాగా.. శనివారం ( మే 10 ) అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన సుదీర్ఘమైన చర్చల తర్వాత.. భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాయని వెల్లడించారు ట్రంప్. కామన్ సెన్స్ ఉపయోగించిన రెండు దేశాలకు అభినందనలు, ధన్యవాదాలు అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. ఇండియా-,పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ లో భాగంగా కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు.
►ALSO READ | పాక్ కు మద్దతిచ్చే దేశాలకు ట్రావెల్ బంద్
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ, సైనిక చర్యలు నిలిపివేయడంపై విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పష్టత ఇచ్చారు. కాల్పులు ,సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్,పాకిస్తాన్ శనివారం మే(10) ఒక అవగాహనకు వచ్చాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం రాజీలేని వైఖరిని కొనసాగిస్తోందని.. ఇకముందు కూడా కొనసాగిస్తుందని జైశంకర్ ట్వీట్ చేశా