బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం మొదలైంది! : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం మొదలైంది! : కిషన్ రెడ్డి
  • యుద్ధం మొదలైంది!
  • నాలుగు నెలల్లో ప్రగతిభవన్ ఎట్ల కట్టుకున్నవ్
  • తొమ్మిదేండ్లయినా పేదలకు ఇండ్లు ఇయ్యవా
  • దమ్ముదైర్యం ఉంటే 50 లక్షల ఇండ్లు కట్టు
  • కేంద్ర మంత్రినే అరెస్టు చేస్తారా..?
  • కేసీఆర్ తీరుపై కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: ‘ కేసీఆర్ యుద్ధం మొదలైంది.. యుద్ధాన్ని మీరే మొదలు పెట్టారు.. మేం సిద్ధమే.. శాంతియుతంగా యుద్ధం చేద్దాం.. కేంద్ర మంత్రినే అరెస్టు చేస్తారా..? బీఆర్ఎస్ పాపాలు పండాయి.. మేం పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చాం.. పార్టీలు మారి రాలేదు’అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ మధ్యాహ్నం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము బాటసింగారంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను చూసేందుకు వెళ్తే.. అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

డబుల్ బెడ్రూం ఇండ్లు, పోడుభూములు, పేదలకు రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి కోసం పోరాడుతామని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ పోలీసులను పెట్టుకొని తెలంగాణను పాలిస్తున్నారని విమర్శించారు.  నాలుగు నెలల్లో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నారని, పేదలకు తొమ్మిదేండ్లయినా కట్టివ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు. కేసీఆర్ కు దమ్ము దైర్యం ఉంటే 50 లక్షల ఇండ్లు కట్టాలని కేంద్రం నుంచి కేంద్రం నుంచి తాను నిధులు తెస్తానని కిషన్ రెడ్డి సవాలు విసిరారు.