పత్తికి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తా : ఎర్రబెల్లి

పత్తికి మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తా : ఎర్రబెల్లి

పత్తి రైతులకు మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తానన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో CCI కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోనే నాణ్యతకు మారుపేరుగా వరంగల్ పత్తి నిలుస్తోందన్నారు.

రైతులకు ఇబ్బంది కలిగించొద్దని సీఎం కేసీఆర్ తనకు ఫొన్ చేసి చెప్పారన్నారు. అధికారులు, జిన్నింగ్ మిల్ వ్యాపారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.  వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.