Wimbledon 2025: గెలిచినోళ్లకు రూ. 34 కోట్లు.. అల్కరాజ్, సిన్నర్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

Wimbledon 2025: గెలిచినోళ్లకు రూ. 34 కోట్లు.. అల్కరాజ్, సిన్నర్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

వింబుల్డన్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. యానిక్  సినర్‌‌‌‌,  కార్లోస్ అల్కరాజ్‌‌‌‌ ఆదివారం (జూలై 13) రాత్రి జరిగే  వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. ప్రస్తుతం మెన్స్ టెన్నిస్ సర్క్యూట్‌‌‌‌లో  సినర్, అల్కారాజ్‌‌‌‌ వైరం అభిమానులను విశేషంగా అలరిస్తోంది. గత నెల రోలాండ్ గారోస్‌‌‌‌లో ఐదున్నర గంటల ఫైనల్లో సినర్‌‌‌‌‌‌‌‌ను ఓడించిన కార్లోస్ టైటిల్ నెగ్గాడు. అదే జోరును గ్రాస్‌‌‌‌ కోర్టులోనూ కొనసాగించాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సినర్ కసితో ఉన్నాడు. గత 12 స్లామ్‌‌‌‌లలో తొమ్మిది వీరిద్దరే గెలుచుకోవడం గమనార్హం.

విజేతకు రూ. 34 కోట్లు:  

వింబుల్డన్‌ 2025 లో ఈ సారి ప్రైజ్‌మనీ భారీగా పెంచారు. టైటిల్ విజేతగా నిలిచిన వారికి ఏకంగా రూ. 34,82,21,100కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ రూ. 17,64,32,024 ప్రైజ్ మనీని అందుకుంటాడు. గత సీజన్ తో పోలిస్తే 10 శాతం ఎక్కువ కావడం విశేషం. పురుషులు, మహిళల విజేతలకు సమాన నగదు బహుమతి దక్కుతుంది. తొలి రౌండ్ లో నిష్క్రమిస్తే రూ. 76 లక్షలు అందుతాయి. రన్నరప్ గా నిలిచిన వారికి రూ. 17 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.624 కోట్లుగా నిర్ణయించినట్లు ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్ అధికారులు వెల్లడించారు. మిగిలిన మూడు గ్రాండ్ స్లామ్స్ తో పోల్చుకుంటే వింబుల్డన్ కు ఎక్కవ ప్రైజ్ మనీ లభించడం విశేషం. 

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
  
వింబుల్డన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారం ఇండియాలో జియో హాట్‌స్టార్ యాప్.. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.  స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.