క్వార్టర్స్‌‌‌‌లో నొవాక్‌‌‌‌,  స్వైటెక్‌‌‌‌

క్వార్టర్స్‌‌‌‌లో నొవాక్‌‌‌‌,  స్వైటెక్‌‌‌‌
  • సిట్సిపాస్‌‌‌‌కు చుక్కెదురు

వింబుల్డన్‌‌‌‌ : గ్రాస్‌‌‌‌ కోర్టులో సెర్బియా లెజెండ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ హవా నడుస్తోంది. వింబుల్డన్‌‌‌‌లో ఎనిమిదో టైటిల్‌‌‌‌ వేటలో జొకోవిచ్‌‌‌‌ ముందంజ వేశాడు. మెగా టోర్నీలో ఆడిన తన వందో మ్యాచ్‌‌‌‌లో గెలిచి 14వ సారి క్వార్టర్ ఫైనల్‌‌‌‌ చేరుకున్నాడు. అతనితోపాటు మూడో సీడ్‌‌‌‌ డానిల్‌‌‌‌ మెద్వెదెవ్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో అడుగు పెట్టారు. ఆదివారం  రాత్రి మొదలై మధ్యలో ఆగి సోమవారం పూర్తయిన మెన్స్‌‌‌‌  ప్రిక్వార్టర్స్‌‌‌‌లో రెండో సీడ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ 7–-6 (8/6), 7–-6 (8/6), 5–-7, 6–-4 తో 17వ సీడ్‌‌‌‌ హుబర్ట్‌‌‌‌ హర్కాజ్‌‌‌‌ (పోలాండ్‌‌‌‌)పై విజయం సాధించాడు. తొలి రెండు సెట్లను జొకో టై బ్రేక్స్‌‌‌‌లో గెలిచిన తర్వాత లండన్‌‌‌‌లో నైట్‌‌‌‌ కర్ఫ్యూ (రాత్రి 11 గం.) అమల్లోకి రావడంతో ఆటను నిలిపి వేశారు. సోమవారం తిరిగి మొదలైన తర్వాత మూడో సెట్‌‌‌‌ కోల్పోయిన జొకోవిచ్‌‌‌‌ తనదైన ఆటతో నాలుగో సెట్‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌ నెగ్గాడు. క్వార్టర్స్‌‌‌‌లో అతను ఏడో సీడ్‌‌‌‌ రుబ్లెవ్‌‌‌‌తో పోటీ పడనున్నాడు. మరో మ్యాచ్‌‌‌‌లో మూడో సీడ్‌‌‌‌ డానిల్ మెద్వెదెవ్‌‌‌‌ (రష్యా) 6–4, 6–2తో లీడ్‌‌‌‌లో ఉన్న టైమ్‌‌‌‌లో  చెక్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ జిరి లెహెకా గాయంతో తప్పుకున్నాడు.

వాకోవర్‌‌‌‌ లభించిన మెద్వెదెవ్‌‌‌‌ వింబుల్డన్‌‌‌‌లో తొలిసారి క్వార్టర్స్‌‌‌‌ చేరాడు. కానీ, ఐదో సీడ్‌‌‌‌ సిట్సిపాస్ (గ్రీస్‌‌‌‌) 6–3, 6–7 (4/7), 6–3, 4–6, 4–6తో యుబాంక్స్ (అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ సీడ్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌ (పోలాండ్‌‌‌‌) 6–7 (4/7), 7–6 (7/2), 6–3తో 14వ సీడ్‌‌‌‌ బెలిండా బెన్సిచ్‌‌‌‌ (స్విట్జర్లాండ్‌‌‌‌)పై కష్టపడి నెగ్గింది. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో రెండో సీడ్‌‌‌‌ అరీనా సబలెంకా (బెలారస్‌‌‌‌) 6–4, 6–0తో ఎకతరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)ను ఓడించగా, ఆరో సీడ్‌‌‌‌ అన్స్ జబెర్‌‌‌‌ (ట్యునీసియా) 6–0, 6–3తో తొమ్మిదో సీడ్‌‌‌‌ పెట్రా క్విటోవా (చెక్‌‌‌‌) పని పట్టింది. మరో మ్యాచ్‌‌‌‌లో మూడో సీడ్‌‌‌‌ రిబకినా (కజకిస్తాన్‌‌‌‌)కు వాకోవర్‌‌‌‌ లభించింది. ఇంకో ప్రిక్వార్టర్స్‌‌‌‌లో 25వ సీడ్‌‌‌‌ మాడిసన్‌‌‌‌ కీస్‌‌‌‌ (అమెరికా) 3–6, 7–6 (7/4), 6–2తో రష్యాకు చెందిన 16 ఏండ్ల మిరా అండ్రీవా జోరుకు చెక్‌‌‌‌ పెట్టి క్వార్టర్స్‌‌‌‌ చేరింది. 

బోపన్న జోడీ ముందంజ

మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ఇండియా లెజెండ్‌‌‌‌ రోహన్‌‌‌‌ బోపన్న తన పార్ట్‌‌‌‌నర్‌‌‌‌ మాథ్యూ ఎబ్డెన్‌‌‌‌ (ఆస్ట్రేలియా)తో కలిసి ప్రిక్వార్టర్స్‌‌‌‌లో అడుగు పెట్టాడు. రెండో రౌండ్‌‌‌‌లో  ఆరో సీడ్‌‌‌‌ బోపన్న–ఎబ్డెన్‌‌‌‌ జోడీ 7–5, 6–3తో బ్రిటన్‌‌‌‌కు చెందిన జాకబ్‌‌‌‌–జొహానస్‌‌‌‌ ద్వయాన్ని వరుస సెట్లలో ఓడించింది.