అంతర్జాతీయ క్రికెట్‌కు విండీస్ ప్లేయర్ శామ్యూల్స్‌ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు విండీస్ ప్లేయర్ శామ్యూల్స్‌ గుడ్‌బై

వెస్ట్ ఇండీస్  సీనియర్‌ క్రికెటర్‌ మార్లన్ సామ్యూల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో ICC చాంపియన్స్‌ ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శామ్యూల్స్‌  విండీస్‌ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు. 207 వన్డేలు, 71 టెస్టులు,67 టీ20లు ఆడిన శామ్యూల్స్‌ అన్ని ఫార్మాట్లు కలిపి 11,134 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు ఉన్నాయి.దీంతో పాటు అన్ని ఫార్మాట్లు కలిపి తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తోనూ 152 వికెట్లు తీశాడు. 2012, 2016 ఐసీసీ T20 ప్రపంచకప్‌లు విండీస్‌ గెలవడంలో సామ్యూల్స్‌ కీలకపాత్ర పోషించాడు.  2016 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో 85 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌తో టీ20 ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా శామ్యూల్స్‌ రికార్డు నెలకొల్పాడు. 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌తో కలిసి సామ్యూల్స్‌ రెండో వికెట్‌కు 372 పరుగులు జోడించడం రికార్డ్ సాధించాడు.