V6 News

పంచాయతీ ఎన్నికలు.. వైన్స్‌‌లు బంద్ : కలెక్టర్ హనుమంతరావు

పంచాయతీ ఎన్నికలు.. వైన్స్‌‌లు బంద్ : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైన్స్​లను మూసివేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఫస్ట్​ ఫేజ్​లో ఈ నెల 11న ఎన్నికలు జరిగే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఆత్మకూర్ (ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో మంగళవారం నుంచి గురువారం కౌంటింగ్​ ముగిసే వరకూ మూసి వేయాలన్నారు. 

సెకండ్​ ఫేజ్​లో భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల్లో 14న ఎన్నికలు జరుగుతున్నందున 12 నుంచి 14న కౌంటింగ్​ముగిసేంతవరకూ మూసివేయాలన్నారు. థర్డ్​ ఫేజ్​లో ఈ నెల 17న చౌటుప్పల్, నారాయణపూర్, అడ్డగూడూర్, మోత్కూర్, గుండాల, మోటకొండూర్ లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 15 నుంచి 17న కౌంటింగ్​ ముగిసేంతవరకూ వైన్స్​లను మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్​ విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.