హైదరాబాద్ సిటీలో రెండ్రోజులు వైన్స్​ బంద్

హైదరాబాద్ సిటీలో రెండ్రోజులు వైన్స్​ బంద్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:వినాయక నిమజ్జనాలు,శోభాయాత్ర సందర్భంగా ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో లిక్కర్​అమ్మకాలపై పోలీసులు నిషే ధం విధించారు. 17న ఉదయం 6 గంటల నుంచి 18న సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సిటీ సీపీ సీవీ ఆనంద్​ఆదేశించారు.

ఈ మేరకు గురువారం నోటిఫికేషన్​రిలీజ్​చేశారు. స్టార్ హోటల్స్‌‌‌‌, రెస్టారెంట్లలోని బ్లార్లను కూడా క్లోజ్​చేయాలని స్పష్టం చేశారు. రూల్స్​బ్రేక్​చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాలని పోలీస్​సిబ్బందిని 
ఆదేశించారు.