హైదరాబాద్​ లో వింగ్స్‌ ఇండియా షో ప్రారంభం

హైదరాబాద్​ లో వింగ్స్‌ ఇండియా షో ప్రారంభం

హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా ప్రదర్శన ప్రారంభమైంది. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వేదికగా జరిగే 'వింగ్స్‌ ఇండియా–2024' కార్యక్రమం ఈ నెల 21 వరకు జరగనుంది. ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తో పాటు ఎయిర్‌ ఇండియా మొదటి హెలికాప్టర్‌ ఏ 350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు.

ఇవే ప్రత్యేకతలు

ప్రపంచ దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్‌, 15 హాస్పిటాలిటీ చాలెట్స్‌.. 106 దేశాల నుంచి 1500 డెలిగేట్స్‌, 5 వేల మంది బిజినెస్‌ విజిటర్స్‌ ఈ షోలో పాల్గొన్నారు. 500కు పైగా బీ2జీ, బీ2బీ సమావేశాలు కూడా జరుగుతాయి. ప్రముఖ హెలికాప్టర్‌ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్‌ల్యాండ్‌, బెల్‌ హెలికాప్టర్స్‌, రష్యన్‌ హెలికాప్టర్స్‌, ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ ప్రదర్శన ఉంటుంది. ప్రముఖ ఇంజిన్‌ తయారీ సంస్థలు సీఎఫ్‌ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్‌, రోల్స్‌ రాయిస్‌, ప్రట్‌ అండ్‌ వైట్నీల ఉత్పత్తుల ప్రదర్శన. యూఎస్‌ఏ, కెనడా, ఫ్రాన్స్‌, జమైకా, మారిషస్‌, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్‌, సౌత్‌కొరియా, గ్రీక్‌, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్‌ ఎగ్జిబిషన్‌కు హాజరు కానున్నారు.