చలికాలంలో పిల్లల సంరక్షణకు 10 చిట్కాలు

చలికాలంలో పిల్లల సంరక్షణకు 10 చిట్కాలు

ఈ చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. కాబట్టి ఫ్లూ, ఇతర శీతాకాల సంబంధిత సమస్యల నుండి వారిని రక్షించడం, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడం తప్పనిసరి. శీతాకాలం ఇప్పటికే ప్రారంభమైనందున ఈ సీజన్‌లో వృద్ధులు, పిల్లలను సంరక్షించే 10 ఆరోగ్య చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉష్ణోగ్రతలను గమనించండి

వృద్ధులు, పిల్లలు చలి బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ. వృద్ధులు, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వేగంగా చలికి గురవుతారు. కాబట్టి ఇంట్లో ఎయిర్ కండీషనర్‌ను వింటర్ మోడ్‌కు సర్దుబాటు చేయండి. వారి గదులు ఎల్లప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోండి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నప్పుడు కిటికీలు మూసి ఉంచండి.

పడిపోయే ప్రమాదాన్ని గుర్తించండి, నివారించండి

చలికాలంలో చలికి వృద్ధులు పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారు తరచుగా తమ పాదాలను చలి నుండి రక్షించుకోవడానికి ఇంట్లో మేజోళ్ళు , చెప్పులు ధరిస్తారు. ఈ మేజోళ్ళు , చెప్పులు చల్లని నేల నుండి రక్షించడంలో సహాయపడినప్పటికీ, అవి కొన్ని సార్లు జారుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. దీని వల్ల నేలపై లేదా మెట్ల మీద పడే ఆస్కారం ఉంటుంది. దీనిని నివారించడానికి వారు బలమైన పట్టును కలిగి ఉండే బూట్లు, చెప్పులు ధరించాలి. దాంతో పాటు నేల (ఫ్లోర్) ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోండి.

దుస్తుల ఎంపికలో తెలివిగా ఉండండి

చలికాలం వచ్చిందని పిల్లలు ఇంట్లోనే ఉండే ఛాన్సే లేదు. కాబట్టి వారిని వెచ్చగా ఉంచే దుస్తులు.. గాలి, వాటర్ ప్రూఫ్ తో కూడిన దుస్తులు ధరించేలా చూసుకోండి. వారు బయటకు వెళ్లినప్పుడల్లా ఉన్ని దుస్తులను ధరించమని చెప్పండి. ఉన్ని బట్టలు ఇన్సులేషన్ లక్షణం కలిగి ఉండడం వల్ల పొడిగా, వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. వృద్ధులకు, ఇంట్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటే వారు థర్మోకోట్ ధరించవచ్చు. ఇది వారి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. వారి ముఖం, చేతులు, చెవులు, మెడను రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ చేతి తొడుగులు, స్కార్ఫ్‌లు, మంకీ క్యాప్‌లను తమతో ఉంచుకోవచ్చు.

భద్రతను పాటించండి

చలికాలంలో ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్లినప్పుడు వారిని భద్రంగా కాపాడుకోవాలి. చలికాలంలో పడే మంచు రహదారిపై జారేలా చేస్తుంది. ఇది వాహనం చక్రం టైర్లు స్కిడ్ అయ్యేలా చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు పడిపోయినప్పుడు వారిని రక్షించడానికి హెల్మెట్, మణికట్టు, మోచేయి, మోకాలికి గార్డులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

వారి పోషణపై నిఘా ఉంచండి

శీతాకాలంలో వచ్చే ఫ్లూ, జలుబును సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా దూరం చేయవచ్చు. వృద్ధులు, పిల్లలు ఇద్దరికీ విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం ఇచ్చేలా ప్రణాళిక చేసుకోండి. డ్రై ఫ్రూట్స్, ముక్కలు చేసిన పచ్చి కూరగాయలు, హోల్ వీట్ క్రాకర్స్, పెరుగు.. లాంటివి వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సమతుల్య ఆహారాన్ని తయారు చేసే కొన్ని ఉత్తమ ఆహార పదార్థాలు.

వారిని హైడ్రేటెడ్ గా ఉంచండి

చలికాలంలో, పిల్లలకు వేడి వాతావరణంలో చెమట పట్టదు. చెమట పట్టకపోవడం వల్ల వారు తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనిని నివారించడానికి విటమిన్ సి అధికంగా ఉండే తక్కువ -చక్కెర రసాలను వారికి అందిస్తూ ఉండాలి.  ఇవి వారి శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తోడ్పడుతుంది. దాంతో పాటు వేడి పానీయాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. వాటిలో టీ, వేడి కోకో లాంటివి కూడా చేర్చవచ్చు

వృద్ధులకు సెల్‌ఫోన్లు అందించాలి

మీ ఇంట్లోని వ-ృద్ధులు లేదా ఎక్కువ వయసున్న వారికి సెలఫోన్ ను అందుబాటులో ఉంచండి. వారికి ఫోన్ వాలా వాడాలో తెలియకపోతే నేర్పించండి. వారి ఫోన్‌లు ఎప్పుడూ ఛార్జ్ చేయబడి ఉండేలా చూసుకోండి. దాంతో పాటు ఎమర్జెన్సీ డయల్స్‌ను ఎలా ఉపయోగించాలో వారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉన్నారో లేదో పరీక్షిస్తూ ఉండాలి. దీని కంటే ముఖ్యమైంది.. వారు ఉపయోగించడానికి సులభమైన ఫోన్‌ను మాత్రమే ఎంచుకొని వారికివ్వండి.