హైదరాబాద్లో చలి చంపేస్తుంది.. 14 డిగ్రీలకు రాత్రి ఉష్ణోగ్రత

హైదరాబాద్లో చలి చంపేస్తుంది.. 14 డిగ్రీలకు రాత్రి ఉష్ణోగ్రత

చలికాలాం చంపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట చలి పంజా విసురుతోంది. హైదరాబాద్ నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడంతో  చలిగాలులు వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 16 డిగ్రీల సెల్సీయస్ కంటే తక్కువగా ఉన్నాయి. అత్యల్పంగా మారేడ్పల్లిలో 14.5 డిగ్రీల సెల్సియస్  ఉష్ణోగ్రత నమోదయ్యింది.  డిసెంబర్ 10న రాత్రి హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా అక్టోబర్, ఫిబ్రవరి మధ్య మధ్యలో చలి ఎక్కువగా ఉంటుంది.  అయితే, ఈ సంవత్సరం, ఎల్ నినో  కారణంగా  నగరంలో కాస్త ఆలస్యంగా డిసెంబర్ లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం పూట పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 దాటినా రోడ్లు కనిపించక తిప్పలు పడుతున్నారు.  

హైదరాబాద్ ప్రాంతంలో డిసెంబర్ 10న  రాత్రి ఉష్ణోగ్రలు

  • మారేడ్‌పల్లి - 14.5 డిగ్రీల ఉష్ణోగ్రత
  • మోండామార్కెట్-  15.8
  • తిరుమలగిరి- 16.1
  • గోల్కొండ- 16.3
  • బండ్లగూడ-  16.5
  • చార్మినార్-  16.7
  • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- 16.7
  • బహదూర్‌పురా-  16.8
  • షేక్‌పేట- 17.1
  • ముషీరాబాద్-  17.2