Coolie: 'కూలీ'కి రూ. 50 కోట్లు.. నా కష్టానికి తగిన పారితోషికం దక్కిందన్న లోకేష్ కనగరాజ్ !

Coolie: 'కూలీ'కి రూ. 50 కోట్లు..  నా కష్టానికి తగిన పారితోషికం దక్కిందన్న లోకేష్ కనగరాజ్ !

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథనాయకుడిగా తెరకెక్కుతున్న  చిత్రం 'కూలీ'.  ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  మూవీలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ , ఉపేంద్ర వంటి అగ్ర తారలు నటిస్తుండటంతో దీనిపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.  దాదాపు 100 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  సుమారు రూ. 400 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ భారీగానే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.  దీనిపై సినీ ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు.

ఇటీవల ఓ ఇంటర్యూలో   లోకేష్ కనగరాజ్  మాట్లాడుతూ.. పెద్ద సినిమాల విడుదల సమయంలో తాను ప్రత్యేకంగా హ్యాండిల్ చేస్తానని చెప్పుకోచ్చారు.  బాక్సాఫీస్ నంబర్లు, రివ్యూలు తనను అంతగా ఆకట్టుకోవని తెలిపారు. ఇలాంటి సమయంలో బయటి ప్రపంచానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతానని అన్నారు.  కూలీ సినిమా విడుదలైన రోజు మూడు షోలు చూస్తాను. ఆ రాత్రి అంతా కలిసి పార్టీ చేసుకుంటాం. ఆ మరుసటి రోజు మాత్రం ఎవరికి చెప్పకుండా నా స్కూల్ ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా మాయమైపోతాను . నాలుగు రోజులపాటు నాకు బయట ప్రపంచమే అని తెలిపారు. అంతా పూర్తయిన, విమర్శకుల అభిప్రాయాలు చెప్పిన తర్వాత తిగిరి వస్తానని వెల్లడించారు. వీలైనంత వరకు బాలికి వెళ్లడానికే ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సినిమా విడుదలైన తర్వాత దాని మార్కెట్ ఎలా ఉందే అనే దానిపై తాను బాధ్యతగా ఉంటానని లోకేష్ కనగరాజ్ తెలిపారు.  ఏదైనా ఒక మూవీ విజయం సాధించే వరకు హీరో, దర్శకుడు, నిర్మాత మాత్రమే  ఆందోళనలో ఉంటారని అన్నారు.  'కూలీ' సినిమాకు తాను తీసుకుంటున్న పారితోషికంపై స్పందిస్తూ..  రూ. 50  కోట్ల మేరకు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికి కారణం  గత చిత్రం 'లియో' విజయమే కారణం" అని లోకేష్ స్పష్టం చేశారు. ఈ మొత్తం పూర్తిగా న్యాయమైనదేనని తాను భావిస్తున్నట్లు చెప్పారు. 

ఈ చిత్రంలో రజనీకాంత్ , అమిర్ ఖాన్ ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలియదు . కానీ నేను మాత్రం రూ. 50 కోట్లు తీసుకుంటున్నా.  దీనికి పన్ను కూడా  చెల్లిస్తాను. నా జీవితంలో రెండేళ్లు  ఈ ప్రాజెక్టుకు కోమే కేటాయించా.  కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉన్నాను. బాధ్యతగా రాత్రింబవళ్లు కష్టపడ్డాను. నాకష్టానికి తగ్గ ఫలితంగా రూ. 50 కోట్లు డిమాండ్ చేయడంలో తప్పులేని చెప్పారు.  నా ట్రాక్ రికార్డును బట్టే నేను పారితోషికం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న విడుదల 'కూలీ' .. జూ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్  నటించిన 'వార్ 2'తో పోటీ పడుతుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.