Junior Review: కిరీటి, శ్రీలీల యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఆకట్టుకుందా?

Junior Review: కిరీటి, శ్రీలీల యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఆకట్టుకుందా?

కర్ణాటక మంత్రి, బిజినెస్మెన్ గాలి జనార్దన్ రెడ్డి పేరు అందరికీ సుపరిచితం. ఇప్పుడాయన కుమారుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘జూనియర్’ (Junior). రాధా కృష్ణ దర్శకుడు. ఈ మూవీలో సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించింది. చాలా కాలం తర్వాత తిరిగి జెనీలియా ప్రత్యేక పాత్రలో కనిపించింది. నేడు శుక్రవారం (జూలై 18న) జూనియర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ మూవీ వైరల్ వయ్యారి సాంగ్‌తో ఆడియన్స్లో ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. ఈ ఒక్కపాటతో సినిమాకు పనిచేసిన గ్రేట్ టెక్నీషియన్స్ ఎవరనేది కూడా తెలిసేలా చేసింది. రిలీజ్కు ముందే వైరల్ అయ్యిన జూనియర్.. ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

విజయనగరానికి చెందిన ఒక మిడిల్ క్లాస్ మనిషి కోదండపాణి (రవిచంద్రన్). అతని భార్య శ్యామల. వీరిద్దరికీ 60 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు. శ్యామల తన బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో కన్నుమూస్తుంది. తల్లిలేని అభికి (కిరీటి రెడ్డి) సర్వం తానై పెంచి పెద్ద చేస్తాడు కోదండపాణి. ఈ క్రమంలో అభిపై తండ్రి కోదండపాణి వీపరీతమైన ప్రేమను చూపిస్తాడు. తన తండ్రి చూపించే ప్రేమ మూలంగా చిన్న చిన్న సరదాలు దూరమవుతున్నాయని అభి భావిస్తాడు.

‘అర‌వ‌య్యేళ్లొచ్చాక  మ‌న‌కంటూ చెప్పుకోవ‌డానికి కొన్ని జ్ఞాప‌కాలు ఉండాలి క‌దా’అనేది అతని సిద్ధాంతం. ఈ క్రమంలో తండ్రి ప్రేమను తట్టుకోలేని అభి సిటీకి వెళ్లి కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ స్ఫూర్తిని (శ్రీలీల‌) ఇష్టపడి ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు. ఆ కంపెనీ CEOఅయిన విజయ సౌజన్య (జెనీలియా)కు అభి అంటే పడదు.

ALSO READ :  ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ రివ్యూ..

అసలు విజయ సౌజన్యతో కిరీటికి మధ్య గొడవ ఏంటీది? విజయ సౌజన్య ఎవరు? ఆమెకు విజయనగరం అంటే ఎందుకు నచ్చదు? అలాంటి ఊరికి అభితోనే కలిసి సౌజన్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ? కోదండపాణి ఊరు నుండి సిటీ ఎందుకు రావాల్సి వచ్చింది? కిరిటీ ప్రేమించిన స్ఫూర్తి కథేంటీ? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

జూనియర్ కథలో కొత్తదనం కనిపించదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలానే ఉంటుంది. బడా ఫ్యామిలీ నుంచే వచ్చే హీరోను పరిచయం చేసే సినిమాకు ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులు ఇందులో ఉన్నాయి. అయితే, టాలీవుడ్ లో వచ్చినా పాత ఫార్ములా కథనే కొత్తగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ రాధాకృష్ణ.

ఫాదర్- సన్, బ్రదర్-సిస్టర్, ఫాదర్-డాటర్ అంశాలతో కథ రాసుకున్నాడు డైరెక్టర్. ఇంకో విషయం చెప్పాలంటే.. సినిమాచూసే కొద్దీ.. స్టోరీ రోటీన్ అనిపించినప్పటికీ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్, లవ్ ట్రాక్ వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ను ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాయి. ఫస్టాఫ్ మొత్తం హీరో హుషారైన డాన్స్‌, హీరోయిన్తో లవ్ ట్రాక్, సత్య, హర్షతో కామెడీ వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి.

ALSO READ : Junior X Review: కిరీటి, శ్రీలీల ‘జూనియర్’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

ఇలా ఫస్టాఫ్‌ను కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో ఎంటర్‌టైనింగ్‌గా నడిపించిన డైరెక్టర్, సెకండాఫ్ మొత్తం ఎమోషనల్ సీన్స్తో రాణించాడు. అయితే, ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్తో.. సినిమా అసలు డ్రామా స్టార్ట్ అవుతుంది. అలా కుటుంబం, అనుబంధాలు అంటూ సెంటిమెంట్ అంశాలతోనే లీనమైన ప్రేక్షకుడికి, సెకండాఫ్‌లో వైరల్ వయ్యారి పాట పెట్టి బూస్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్లో హీరో కిరిటీకి, జెనిలియా మధ్యన వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. 

ఎవరెలా చేశారంటే:

హీరో కిరీటికి జూనియర్ ఫస్ట్ మూవీ అయినప్పటికీ.. నటనలో తన చతురత చూపించాడు. నటనలోనే కాకుండా ఫైట్స్, డ్యాన్స్లో అదరగొట్టేశాడు. జూనియర్ కిరీటి వన్ మెన్ షో అని చెప్పొచ్చు. ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్‌లో శ్రీలీలకు తగ్గాఫర్ పోటీ ఇచ్చాడు.

శ్రీలీల గ్లామర్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. మరోసారి తనదైన డ్యాన్స్తో కుమ్మేసింది. కథలో శ్రీలీల క్యారెక్టర్ పెద్దగా లేకపోయినప్పటికీ.. పాటలతో గుర్తుంటుంది. ఇక జెనీలియా చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. సీరియస్ టోన్‌లో నటించి గుర్తుండిపోతుంది.

కన్నడ అలనాటి హీరో ర‌విచంద్ర‌న్, రావు ర‌మేశ్‌ పాత్రలు సినిమాకు సరైన న్యాయం చేశాయి. మిగతా పాత్రల్లో నటించిన నటులు సైతం తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. 

సాంకేతిక అంశాలు:

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ అస్సెట్. సినిమాటోగ్రఫీ కేకే సెంథిల్ కుమార్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ సైతం మరో ప్రధాన బలంగా నిలిచారు. ప్రొడక్షన్ డిజైన్‌ రవీందర్ మంచి పనితీరును క‌న‌బ‌రిచాడు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని డైలాగ్స్ మెప్పిస్తాయి. ఎడిటింగ్‌ నిరంజన్ దేవరమానె కొన్ని సీన్స్ లో కత్తెరకు పదునుపెడితే బాగుండు. రాధాకృష్ణ రెడ్డి రాసుకున్న కథలో ఇంకాస్త బలం ఉంటే  ద‌ర్శ‌కుడిగా గుర్తిండిపోయేవాడు.