Junior X Review: కిరీటి, శ్రీలీల ‘జూనియర్’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Junior X Review: కిరీటి, శ్రీలీల ‘జూనియర్’ X రివ్యూ.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా జెనీలియా కీలక పాత్ర పోషించిన చిత్రం ‘జూనియర్’.రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జులై18న) థియేటర్లో విడుదలైంది.

పొలిటీషియన్, బిజినెస్మెన్  కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు ఎంట్రీ ఇస్తుండటం కన్నడ ఆడియన్స్లో మంచి బజ్ క్రియేట్ అయింది. దానికితోడు సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ఉండటం వల్ల తెలుగు ఆడియన్స్లో సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అంతేకాకుండా సినిమా రిలీజ్కు ముందే, వైరల్ వయ్యారి సాంగ్తో మంచి ఊపు ఇచ్చేసింది. మరి 1000కి పైగా స్క్రీన్స్‌లో రిలీజైన జూనియర్ పబ్లిక్ టాక్ ఎలా ఉంది? సినిమా అంచనాలు అందుకుందా? లేదా? అనేది X రివ్యూలో తెలుసుకుందాం. 

కిరీటి రెడ్డి, శ్రీలీల సినిమాకు యావరేజ్ టాక్ వస్తోంది. వీరిద్దరి డ్యాన్స్ మార్క్ అదిరిపోయిందని అంటున్నారు. అయితే, సినిమాకు మెయిన్ మైనస్ కథ అని అంటున్నారు. గతంలో వచ్చిన సినిమా కాన్సెప్ట్స్ తరహాలోనే కథ సాగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

అందులో ఒక నెటిజన్ తన రివ్యూ షేర్ చేశాడు. 'జూనియర్' ఫస్టాఫ్ కమర్షియల్. సెకండాఫ్ ఎమోషనల్‌ సాగింది. అయితే, ఎన్నో సినిమాల్లో చూసిన సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ తెరపై వచ్చినట్టు అనిపించింది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ చాలా వీక్. అలాగే ఎమోషనల్ సీన్స్ లో బలమైన ప్రభావం లేదు. అయినప్పటికీ, కిరీటి & శ్రీలీల యొక్క అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది.

దేవిశ్రీ డైనమిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. వైరల్ వయ్యారి పాట, ఆడియన్స్ కు పూర్తి విందు. ముఖ్యంగా కిరీటి డ్యాన్స్ లో తన ఎంట్రీతో ఇచ్చిపడేశాడని' నెటిజన్ తన రివ్యూలో చెప్పుకొచ్చాడు. 

మరో నెటిజన్ రివ్యూ రాస్తూ.. 'కిరీటి నటన, డాన్స్ సూపర్ గా చేసాడు. శ్రీలీల ఎప్పటిలానే దుమ్ములేపింది. కానీ, ఈ సినిమాలో కథ ప్రదానమైన మైనస్. ఎన్నో సినిమాలలో చూసి రుద్దేసిన టెంప్లెట్ లో సాగుతుంది.దేవిశ్రీ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ సూపర్' అని ట్వీట్ చేశాడు.