Good Health: చలికాలం అస్తమా వేధిస్తుందా..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

Good Health: చలికాలం అస్తమా వేధిస్తుందా..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

ఉబ్బసం... దీన్నే ఆస్తమా అని కూడా అంటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిలోనూ ఉబ్బసం జబ్బు కనిపిస్తుంది. అయితే ఇద్దరి లోనూ కారణాలు వేరు వేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం'ఆయాసం...చలికాలంలో ఈ ఆస్తమా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఈ ఉబ్బసం కారణంగా శ్వాస నాళాలు సంకోచించి వాస్తాయి. శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుపడుతుంది. ఇలా శ్వాస నాళాలు సంకోచించడం వల్ల పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం  దగ్గు వంటివి వస్తాయి. వాటికి ఎన్ని మందులు వాడినా శాశ్వత పరిష్కా రం దొరకదు. . తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరిగి వచ్చే స్తుంది. అందుకే ఈ వ్యాధితో బాధపడేవాళ్లు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావొచ్చు.

కాలుష్యమే ముంచుతోంది

 ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన,చెందుతున్న దేశాల్లో ఆస్తమా ఎక్కువుగా కనిపిస్తోంది. ఇందుకు ముఖ్య కారణం వాయుకాలుష్యం పిల్లల్లో అయితే నలుగురిలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. వాహనాల నుంచి విడుదలయ్యే పొగ, రసాయనాలు ఆస్తమాను మరింత పెంచుతున్నాయి. అందుకే వీలైనంత వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతా లో తిరగకపోవడమే మేలు అంతేకాదు... చాలా రోజులుగా కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగినా అస్తమా బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుఫులు హెచ్చరిస్తున్నారు. 

ఈ జాగ్రత్తలు తప్పని సరి

ఈ చలికాలంలో మామూలు వాళ్లకే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే ఈ ఇస్తమా పేషెంట్లు  మరింత జాగ్రత్తగా ఉండాలి . చాలామంది ఇన్ హేలర్ ను రెగ్యులర్ గా వాడరు. కానీ ఇలాంటి టైమ్ లో తప్పనిసరిగా వాడాలి. అలాగే మార్నింగ్ వాక్ కు వెళ్ళేవాళ్లు, మంచు కురిసేటప్పుడు కాకుండా కాస్తంత ఎండొచ్చాక వెళ్లాలి. రద్దీగా ఉన్న ప్రదేశాలకు వెల్లినప్పుడు ముఖానికి మాస్క్ లేదా కర్చీఫ్ కట్టుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలైనా, పెద్దటైనా సీజనల్ వ్యాక్సినేషన్ చేయిం చుకుంటే.. అలర్జీ, ఇన్ఫెక్షన్లు వంటివి. చాలావరకు రాకుండా ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  •  ఎప్పుడూ ముఖాన్ని స్కార్ఫ్ లేదా వింటర్ మాస్క్ కప్పేయాలి. ముఖ్యంగా నోరు, ముక్కు పూర్తిగా కవర్​ అవ్వాలి.
  • వ్యాయామం చేయాల్సి వస్తే జిమ్ లేదా ఇంట్లోనే చేయాలి. బయటి వాతాపరణంలో చేయొద్దు.
  •  ఎప్పటికప్పుడు చేతులను హ్యాండ్​ వాష్​తో శుభ్రం చేసుకోవాలి.
  •  వంటింట్లో లేదా బయట ఏదైనా పెద్ద మంటతో కాలుతున్నప్పుడు పక్కన ఉండకపోవడమే మేలు..
  •  బయటికి వెళ్లేటప్పుడు లేదా వ్యాయామం చేయడానికి ముందు మందులను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే రెగ్యులర్ చెకప్​ లు ముఖ్యం.
  •  ఆస్తమా ఉన్న వాళ్లు సమస్య పెరగ కుండా ఉండాలంటే ధూమపానం చేయకూడదు. 
  • అలాగే దుమ్మూధూనికి దూరంగా ఉండాలి.
  •  కూల్ డ్రింక్స్​, ఐస్​క్రీములు ఫ్రిజ్ నీళ్లు తాగొద్దు. 
  •  ఇంట్లో బూజు దులపడం లాంటి పనులు ఆస్తమా ఉన్నవాళ్లు.. చేయొద్దు

ఉబ్బసం (ఆస్తమా) పెంచేవి

  •  చలికాలం 
  • పైంపుడు జంతువుల ఉన్ని
  •  గాల్లోని రసాయనాలు
  • ఘాటు వాసనలు
  •  అతిగా చేసి శారీరక శ్రమ

చలికాలంలో తీవ్రత

ఆస్తమాతో ఏ కాలంలోనైనా ఇబ్బందే. కాకపోతే చలికాలంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు రకాల సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఒకటి.. ఈ చలికాలంలో ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడం వల్ల పాత పుస్తకాలం, పర్నీచర్​లలో దుమ్ము ..పెంపుడు జంతువుల వల్ల ధూళి (వాటి ఉన్ని) వంటింట్లోంచి వాసనలు, పొగ వల్ల శ్వాస కష్టమవుతుంది. రెండోది.. బయటికి వెళ్లినప్పుడు చల్లగాలిని పీల్చుకోవడం. ఈ రెండింటి వల్ల అస్తమా లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఈ కాలంలో ఆస్తమా ఉన్న పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలి..

వెలుగు, లైఫ్