Kitchen Telangana: సజ్జలతో బిస్కెట్స్ .. చలికాలం.. స్కిన్ హెల్త్ కు సపోర్ట్ .. ఇంకా ఎన్నో లాభాలు

Kitchen Telangana: సజ్జలతో బిస్కెట్స్ .. చలికాలం.. స్కిన్ హెల్త్ కు సపోర్ట్ .. ఇంకా ఎన్నో లాభాలు

రుచికరంగా ఉంటూనే ఆరోగ్యాన్నిచ్చే వాటిలో మిల్లెట్స్​ టాప్​ ప్లేస్​లో ఉంటాయి. అలాంటి మిల్లెట్స్​ను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నారు ఎక్స్​పర్ట్స్. అయితే, వండే తీరు తెలియక చాలామంది వంటింట్లో చిరుధాన్యాల ఊసే కనిపించదు. కానీ, మిల్లెట్స్​ని ఇలా శ్నాక్స్​లా చేసుకుంటే మాత్రం ఒక్కటి కూడా మిగల్చకుండా లాగించేస్తారు.. 

సజ్జల్లో హై ఫైబర్ ఉంటుంది. ఐరన్, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో బాడీకి సరిపడా పోషకాలను అందిస్తాయి. స్కిన్​ హెల్త్​కు సపోర్ట్ చేస్తాయి. ఇవి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకా మరెన్నో లాభాలున్నాయి. కాబట్టి ఈ రెసిపీలు అస్సలు మిస్​ అవ్వకండి.

సజ్జలతో బిస్కెట్స్ తయారీకి కావాల్సినవి 

  • సజ్జ పిండి: రెండు కప్పులు
  • బెల్లం: ఒక కప్పు
  • నువ్వులు: అర కప్పు
  • నీళ్లు, నెయ్యి: సరిపడా

తయారీ విధానం: బెల్లంలో నీళ్లు కలిపి కాస్త దగ్గరపడేవరకు మరిగించాలి. ఒక గిన్నెలో సజ్జ పిండి, నువ్వులు వేసి కలపాలి. అందులో కొంచెం కొంచెంగా బెల్లం నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా కలపాలి. తర్వాత నెయ్యి పూసిన బటర్ పేపర్ మీద పెట్టి చపాతీలా చేయాలి. ఆపై ఒక గ్లాసుతో అచ్చులు వేయాలి. చివర్లు తీసేసి, గుండ్రంగా వచ్చిన బిస్కెట్లపై ఫోర్క్​తో గాట్లు పెట్టి, నువ్వులు అద్దాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో రెడీ చేసుకున్న బిస్కెట్లను వేసి వేగించాలి. చల్లారాక వీటిని తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తాయి.   

–వెలుగు, లైఫ్​–