వింటర్ సీజన్ కొనసాగుతుంది. చలి ఇరగదీస్తుంది.. ఒక్క చలే కాదు.. చర్మం ఎక్కడ పడితే అక్కడ పగిలి ఓ పక్క మంట.. మరో పక్క తేమ తగ్గి .. చర్మం పొడిబారండంతో.. బయటకు రావాలంటే గిల్టీగా ఫీలవుతున్నారు.
చాలామంది చలికాలంలో రసాయనాలు కలిసిన ఫేస్ క్రీమ్స్, లోషన్స్, ఫేస్ వాష్ సబ్బులు వాడుతున్నారు. అయితే వీటివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకే పూర్వకాలంలో ఇంట్లో అమ్మమ్మలు.. బామ్మలు ఉపయోగించిన చిట్కాలే బాగా పని చేస్తాయి. చర్మం పొడి బారకుండా ఉంటాలంటే వంటింటి చిట్కాలను ఒకసారి పరిశీలిద్దాం. . . !
శీతాకాలంలో పొడి చర్మం చాలా సాధారణం. చేతులు , కాళ్ళ నుండి ముఖం వరకు, మన చర్మం దాని కాంతిని కోల్పోయి నిస్తేజంగా మారుతుంది. అయితే ఈ సమస్యను ఇంటి నివారణలతో ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- శీతాకాలంలో రాత్రిపూట చర్మం ఎక్కువగా పొడిగా ఉంటుందని, కాబట్టి పడుకునే ముందు కొబ్బరి నూనెతో తేలికపాటి మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనెను చర్మం గ్రహించి రాత్రంతా తేమగా ఉంచేలా సహాయపడుతుంది. దీన్ని మీ ముఖం, చేతులు , కాళ్ళకు గా అప్లై చేయండి. ఇలా చేయడం పొద్దున్నే లేవగానే చర్మం మృదువుగా ఉంటుంది.
- చర్మం పొడిబారకుండా ఉండటానికి, వారానికి రెండుసార్లు పాలు , తేనెతో తయారు చేసిన మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. అర టీస్పూన్ తేనెను .. ఒక టీస్పూన్ పచ్చి పాలలో కలిపి మీ ముఖానికి రాసుకొని... పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది. తక్షణమే పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఈ ప్యాక్ చర్మాన్ని నిగ నిగలాడే విధంగా ఉంచుతుంది.
- శీతాకాలంలో చేతులు , కాళ్ళలో పొడిబారడానికి గ్లిజరిన్ .. రోజ్ వాటర్ ను రాసుకోండి . ఈ రెండింటినీ సమపాళ్లలో కలిపి రోజూ రాత్రి పడుకునే ముందు అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. చర్మం పగుళ్లు.. మడమల పగుళ్ల నుంచి గొప్ప ఉపశమనం కలుగుతుంది.
- శీతాకాలంలో మృత చర్మ కణాలు త్వరగా పేరుకుపోతాయి. ఓట్ మీల్ పాలతో తేలికపాటి స్క్రబ్ తయారు చేసి స్నానానికి ముందు ఉపయోగించాలి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి .. తేమగా ఉండేలా చేస్తుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
- శీతాకాలంలో చర్మంపై పగుళ్లు వస్తాయి . చాలామందికి మడమల దగ్గర పగిలి అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. రోజూ రాత్రిసమయంలో మడమల దగ్గర గోరువెచ్చని ఆవనూనె రాసి 5 నిమిషాలు మసాజ్ చేయండి. తరువాత, కాటన్ సాక్స్ ధరించండి. ఇది మడమలను మృదువుగా చేస్తుంది. పగుళ్లను గణనీయంగా తగ్గిస్తుంది.
- శీతాకాలంలో ముఖానికి పెరుగు... శనగపిండిని కలిపి ఫేస్ మాస్క్‌గా అప్లై చేయండి. ఇది తక్షణమే చర్మాన్ని తేమ చేస్తుంది.
