పార్లమెంట్ పై ప్రజలకు విశ్వాసాన్ని పెంచారు

పార్లమెంట్ పై ప్రజలకు విశ్వాసాన్ని పెంచారు

కొత్త పార్లమెంట్ భవనంలోనే శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభ సజావుగా జరిగేందుకు అన్నిపార్టీల నేతలు సహకరించాలన్నారు. పార్లమెంటుపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచినందుకు సహకరించినందుకు ప్రధాని, ఎంపీలందరికీ  లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ గా మూడేళ్ల పదవీకాల పూర్తి చేసుకున్న సందర్భంగా ధన్యావాదలు తెలిపారు ఓం బిర్లా. కరోనా సమయంలో అన్ని దేశాల పార్లమెంట్లు వర్చువల్ మోడ్ లో పనిచేసినా.. భారత పార్లమెంటు మాత్రం లైవ్ సెషన్స్ నిర్వహించిందన్నారు. గత మూడేళ్లలో లోక్ సభ ప్రొడక్టివిటీ గరిష్ఠంగా ఉందని ఓం బిర్లా తెలిపారు.