నవంబర్‌ 29 నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

నవంబర్‌ 29 నుండి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  నవంబర్‌ 29 నుండి డిసెంబర్‌ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని  పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ (CCPA) సిఫార్సు చేసింది. CCPA అక్టోబర్‌ చివరి వారంలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం 19 రోజుల పాటు ఏకకాలంలో లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.