సిడ్నీ: ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ 50వ బర్త్ డేను పురస్కరించుకుని క్రికెట్ వరల్డ్ అభినందనలతో ముంచెత్తింది. పాతతరం క్రికెటర్ల నుంచి మొదలుకొని చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో మాస్టర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఐకానిక్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో సచిన్ పేరుతో ఓ గేట్‌ను ఆవిష్కరించారు. ఈ గేట్ ద్వారానే ప్లేయర్లు ఫీల్డ్‌లోకి వెళ్తారు. దీని పక్కనే వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా పేరు మీద మరో గేట్‌ను ఓపెన్ చేశారు. సచిన్–లారాకు సంబంధించిన విశేషాలను ఓ బోర్డుపై డిస్ప్లే చేశారు. సిడ్నీలో 5 టెస్ట్‌లు ఆడిన మాస్టర్ మూడు సెంచరీలతో 785 రన్స్ చేశాడు. 241* హయ్యెస్ట్ స్కోరు. ‘ఇండియా వెలుపల సిడ్నీ నా ఫేవరెట్ గ్రౌండ్. 1991–92లో మొదలైన నా మొదటి టూర్ నుంచి ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లారా నేను మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరి పేర్ల మీద గేట్లు ఓపెన్ చేసినందుకు మరింత సంతోషంగా ఉంది. ’ అని సచిన్ వ్యాఖ్యానించాడు.