కొత్త కార్లే తక్కువకు వస్తుంటే.. సెకండ్ హ్యాండ్ కార్లు ఇంకెంత తగ్గాలి.. : కార్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు..!

కొత్త కార్లే తక్కువకు వస్తుంటే.. సెకండ్ హ్యాండ్ కార్లు ఇంకెంత తగ్గాలి.. : కార్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు..!

సెప్టెంబర్ 22 అంటే సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర తెచ్చిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా కార్ల ధరలను కంపెనీలు తగ్గించాయి. దీంతో మారుతీ లాంటి కంపెనీలు అనేక మోడళ్లపై రేట్లను తక్షకు పైనే తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్-ప్రెస్సో బేస్ వేరియంట్ ధర 3.49 లక్షలు, ఆల్టో స్టార్టింగ్ ధర 3.69 లక్షలు.. ఇలా చాలా మోడళ్ల రేట్లు తగ్గించటంతో కొత్త బ్రాండ్ న్యూ కార్లు మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటు రేట్లలోకి వచ్చేశాయి. దీంతో జీఎస్టీ రేట్ల తగ్గింపు ఎఫెక్ట్ ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్ల మార్కెట్లపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. 

కొత్త కార్లే తక్కువ రేటుకు అందుబాటులోకి వచ్చేసిన తర్వాతా పాత కార్లు కొనేవారు బేరసారాలు పెంచేస్తున్నారు. దీంతో స్పిన్నీ, కార్స్24 లాంటి యూజ్డ్ కార్ సెల్లింగ్ ఫ్లాట్ ఫారం సంస్థలు చాలా కార్లపై లిస్టింగ్ రేట్లను రూ.2 లక్షల వరకు తగ్గించి జీఎస్టీ రేట్ల మార్పుల అమలుకు ముందు నుంచే కస్టమర్లను ఆకర్షించటం స్టార్ట్ చేశాయి. ప్రధానంగా చిన్న నగరాల్లో అలాగే మెుదటి సారి కార్లు కొంటున్న వారి నుంచి పాత కార్లకు డిమాండ్ అలాగే కొనసాగుతోందని తేలింది. అలాగే మంచిగా మెయింటెన్ చేసిన సెకండ్ హ్యాండ్ కార్లను కొనటానికి కూడా చాలా మంది మక్కువ చూపుతున్నట్లు తేలింది. అయితే ఎవరైనా తమ పాత కారు అమ్మాలనుకున్నా మార్కెట్లో పెద్దగా ఇబ్బందికర వాతావరణం లేదని స్వల్పంగా గ్యాప్ క్రియేట్ మాత్రమే అయ్యిందని సెకండ్ బ్యాంక్ కార్ల అమ్మే వ్యాపారులు చెబుతున్నారు. 

ALSO READ : వారు హెచ్1బి వీసా కోసం లక్ష డాలర్లు కట్టక్కర్లేదు..

వడ్డీ రేట్లతో పోటీ పెంచేస్తున్న బ్యాంకులు.. 

ఒకపక్క జీఎస్టీ రేట్ల తగ్గింపులతో కొత్త కార్ల రేట్లు తగ్గిపోగా.. మరోపక్క బ్యాంకులు అమ్మకాల జోరును పెంచేందుకు తమ వంతుగా వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. దీంతో ఈసారి దసరా, దీపావళికి కార్లు కొంటున్న చాలా మందికి డబుల్ బొనాంజా ఆఫర్ ఇదని చెప్పుకోవచ్చు. ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా తన కార్ లోన్ వడ్డీ రేట్లను 8.40 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించింది. దీంతో కొత్త కారు కొన్న సంతోషం వడ్డీ భారం తగ్గటంతో మరింత రెట్టింపు అవుతోంది. మరికొన్ని బ్యాంకింగ్ సంస్థలు వడ్డీ రేట్లు తగ్గించనప్పటికీ రీపేమెంట్స్ విషయంలో వెసులుబాట్లను కారు కొనుగోలుదారులకు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో కారు లోన్ తీసుకునే వారికి రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అదనపు సేవింగ్స్ లభిస్తు్న్నాయి.