
H1B Fee Waiver: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమెరికన్ల ఉద్యోగాలను హెచ్1బి వీసాలు హరిస్తున్నాయనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో హెచ్1బి వీసాలను దుర్వినియోగాన్ని నివారించేందుకు దాని ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు. అంటే అత్యంత టాలెంట్ ఉంటే తప్ప అమెరికాలో జాబ్ పొందటం అనేది పెద్ద కలగానే మిగలనుంది. సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త రూల్స్ కేవలం కొత్తగా వీసా కోసం అప్లై చేసేవారికేనని మాత్రమే. ప్రస్తుతానికి ట్రంప్ ఈ రూల్ 12 నెలలు పాటు అమలులో ఉంటుందని వెల్లడించారు. భవిష్యత్తులో ఏవైనా పొడిగింపులు ప్రకటించే అవకాశం ఉండొచ్చు.
అమెరికాలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు వీటికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. లక్ష డాలర్లు పే చేయని హెచ్1బి వీసా హోల్డర్లను దేశంలోకి ఎంట్రీ అవ్వకుండా వీరు నిరోధిస్తారు. ఇదే సమయంలో అమెరికా దేశ అవసరాల దృష్ట్యా అక్కడి భద్రత అలాగే సంక్షేమానికి ముప్పు కలిగించని కొన్ని రంగాలకు మాత్రం లక్ష డాలర్ల రుసుమును మాఫీ చేయటానికి వెసులుబాటును ఉత్తర్వుల్లోని సెక్షన్ 1(సి) కల్పించింది.
ALSO READ : పిడుగులాంటి వార్త చెప్పిన ట్రంప్..
లక్ష డాలర్లు కట్టక్కర్లేని ఉద్యోగాలు ఇవే..
* ఆరోగ్య సంరక్షణ అలాగే వైద్య పరిశోధన కోసం హెచ్1బి వీసాలు పొందే విదేశీయులకు లక్ష డాలర్ల రుసుము మాఫీ చేయబడుతుంది.
* అమెరికా రక్షణ రంగం అలాగే సైబర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ వంటి రంగాల్లో పనిచేయటానికి హెచ్1బి వీసా పొందే విదేశీయులకు ఎగ్జెమ్షన్ ఇవ్వబడుతోంది.
* అమెరికాలో కొరత ఉన్న ప్రత్యేక శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల పాత్రల కోసం వేళ్లే హెచ్1బి వీసాహోల్డర్లకు లక్ష డాలర్ల రుసుము వర్తించదు.
* కీలకమైన మౌలికసదుపాయాలకు సపోర్ట్ చేసేందుకు ఆర్థిక వ్యవస్థ, భద్రత, అంతరీక్ష రంగాల్లో పనిచేయటానికి వెళ్లే విదేశీ ప్రతిభకు కూడా ప్రస్తుతం ట్రంప్ సర్కార్ రుసుము మాఫీని ఆఫర్ చేస్తోంది.
అలాగే కొత్త రూల్స్ అమెరికాలో జీతాల పెంచాలని కార్మిక శాఖ నిర్థేశిస్తోంది. అంటే కేవలం అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఎక్కువ చెల్లింపులతో హెచ్1బి వీసాలపై రిక్రూట్ చేసుకునేలా ఇది కంపెల్ చేయనుంది. ఈ నియామకాలను ఫెడరల్ ఏజెన్సీలు ఏడాది పాటు సమీక్షిస్తూనే ఉంటారని తెలుస్తోంది. దీంతో హెచ్1బి వీసాల దుర్వినియోగం అరికట్టాలని ట్రంప్ గట్టిగా ఉన్నారు.