హైదరాబాద్, వెలుగు: వైర్లెస్ టెక్నాలజీ సంస్థ సిలికాన్ ల్యాబ్స్ హైదరాబాద్‌లోని తన కేంద్రాన్ని విస్తరించింది. కొత్త ఆఫీసును అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ప్రారంభించారు. వైర్లెస్ ఆర్ అండ్ డీ రంగంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని కంపెనీ సీఈఓ మ్యాట్ జాన్సన్ తెలిపారు. 2020 నుంచి ఇక్కడి ఉద్యోగుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అభివృద్ధి కోసం కొత్త ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సురక్షితమైన వైర్లెస్ పరిష్కారాలను అందించడంలో హైదరాబాద్ కేంద్రం కీలకంగా మారనుందని ఈ కంపెనీ తెలిపింది.
