
రుద్ర వీరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీరరాజు 1991’. కిరణ్ చెరుకూరి నిర్మించారు. అజయ్ ఘోష్, బెనర్జీ, అర్చన, రాహుల్, గోపారాజ్, కిషోర్ ఇతర పాత్రలు పోషించారు. గురువారం (May 12) సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ ‘మత్స్యకారుల జీవితంలో జరిగే సంఘటనల నేపథ్యంలో జరిగే కథ ఇది. వాళ్ల జీవితాలను చాలా బాగా చూపించారు. నటుడిగా, దర్శకుడిగా వీరాజ్ సమర్థవంతంగా పనిచేశాడు’ అన్నారు.
టీమ్ అందరి సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చిందని, కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు రుద్ర వీరాజ్ తెలిపాడు. సినిమాను ఆదరించాలని నిర్మాత కిరణ్మయ్ చెరుకూరి, సహనిర్మాత శివాన్వితరావు కోరారు. నటుడు బెనర్జీ, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.