మెహిదీపట్నంలో భారీ వర్షం

మెహిదీపట్నంలో భారీ వర్షం

నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్ లో పలుచోట్ల వాన పడింది. లింగంపల్లి,కూకట్ పల్లి,ఉప్పల్, ఘట్కేసర్ లో ఓ మోస్తరు వర్షం కురవగా.. మెహిదీపట్నంలో వాన దంచికొట్టింది. రోడ్డుపై వరదనీరు ప్రవహించడంతో చిరువ్యాపారులు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక విద్యార్థులు ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వర్షం భారి నుంచి తప్పించుకునేందుకు పలువురు షాపుల్లోకి పరుగులు పెట్టారు. మెహిదీపట్నంలో భారీ వర్షం కురవడంతో రోడ్డు మొత్తం తడిసి ముద్దయ్యింది.