మొక్కలు ఇట్ల.. హరితహారం ఎట్ల

మొక్కలు ఇట్ల.. హరితహారం ఎట్ల

హరితహారంలో భాగంగా వచ్చేనెలలో మొక్కలు నాటేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ.. చాలా నర్సరీల్లో మొక్కలు ఎండిపోతుండడంతో కార్యక్రమం లక్ష్యం చేరుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలకరి వర్షాలతో అంటే జూన్ నుంచి హరితహారం ప్రారంభం కానుంది. అయితే ఎండతీవ్రత, నీటి సమస్య, కూలీల కొరత కారణంగా చాలాచోట్ల నర్సరీల్లో మొక్కలు ఎండిపోయాయి. ఇంకొన్ని నర్సరీల్లో స్టంప్స్‌‌ బ్యాగుల్లో విత్తనాలు సమయానికి నాటకపోవడం.. ఇతరత్రా కారణాలతో మొక్కలు రాలె. ఈసారి మొత్తం 1,482 నర్సరీల్లో 1.77 లక్షల మొక్కలు పెంచా లని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొక్కలు ఎండిపోవడం, ఇంకొన్ని చోట్ల అసలే మొలకెత్తకపోవడంతో హరితహారం లక్ష్యం చేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – ఆసిఫాబాద్,వెలుగు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి