న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో దేశంలో కేసుల సంఖ్య, ఆ కేసులు రెట్టింపయ్యే రేటు బాగా తగ్గిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇంతకుముందు (మార్చి 15 నుంచి 31 వరకు) కేసుల సగటు పెరుగుదల రేటు 2.1 ఉండగా, ఏప్రిల్ 1 నుంచి 1.2కు తగ్గిందని తెలిపింది. లాక్‌డౌన్ టైంలో టెస్టుల సంఖ్యను పెంచడంతో 40 శాతం కేసులు తగ్గాయని పేర్కొంది. లాక్‌డౌన్‌కు ముందు 3 రోజుల్లో కేసులు రెట్టింపవగా, ఇప్పుడు 6.2 రోజులు పడుతోందని చెప్పింది. శుక్రవారం ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ అవ్ అగర్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య, మృతుల సంఖ్య 80:20 నిష్పత్తిలో ఉందని వెల్లడించారు. ఈ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నామన్నారు. ‘‘లాక్‌డౌన్‌కు ముందు దేశంలో కరోనా కేసులు ప్రతి మూడు రోజులకు రెట్టింపు అయ్యేవి. గత ఏడు రోజుల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే కేసుల డబ్లింగ్ రేట్ తగ్గింది. ఇప్పుడు కేసులు డబుల్ అయ్యేందుకు 6.2 రోజులు పడుతోంది. ఈ రేటు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది” అని లవ్ అగర్వాల్ తెలిపారు.
ఇంకేం చెప్పారంటే…
దేశవ్యాప్తంగా కరోనా ట్రీట్ మెంట్ కోసం కేటాయించిన 1,919 ఆస్పత్రుల్లో 1.73 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 21,800 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.గడిచిన 24గంటల్లో కొత్తగా 915 కేసులు నమోదయ్యాయి. 31 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 14,347కు, మృతుల సంఖ్య 479కు చేరింది. ఇప్పటి వరకు 2,006 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం పేషెంట్లలో 13.06 శాతం మందికి జబ్బు తగ్గింది. చైనా నుంచి వచ్చిన 5 లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ కిట్లను రాష్ట్రాలకు అందజేశాం.
100 టన్నుల మెడిసిన్స్ డెలివరీ
లాక్‌డౌన్‌లో పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా 100 టన్నుల మెడిసిన్స్‌ను డెలివరీ చేసిందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సరుకు రవాణా విమానాలు, మెయిల్ వ్యాన్ల ద్వారా వీటిని చేరవేసినట్టు చెప్పింది. హోంశాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య శాలియా శ్రీవాస్తవ శుక్రవారం ఆ వివరాలను వెల్లడించారు. టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లను హాస్పిటళ్లకు సరఫరా చేసినట్టు చెప్పారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా 2 లక్షల మంది పోస్టుమెన్లు, గ్రామీణ డాక్ సేవక్స్ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తున్నారని ఆమె చెప్పారు. దీని ద్వారా వందల కోట్లలో పేమెంట్స్ జరుగుతున్నాయన్నారు. పెన్షనర్లు తమ ఇంటి దగ్గరే డబ్బు పొందుతున్నారన్నారు. అంతర్ రాష్ట్ర, రాష్ట్రాల లోపల డెలివరీలకు పోస్టల్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా అధికారులు, ఎన్జీవోలతో కలిసి ఫుడ్ ఐటమ్స్, రేషన్ పంపిణీ చేపట్టినట్టు శ్రీవాస్తవ తెలిపారు. దేశవ్యాప్తంగా మొబైల్ పోస్టాఫీసులు పని చేస్తున్నాయని, వీటిలో కొన్ని పోస్టల్, ఫైనాన్షియల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.కాగా, మే మొదటి వారంలో కరోనా కేసులు పీక్‌కు చేరుతాయని, తర్వాత క్రమంగా తగ్గుతాయని అంచనాలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ అధికారులు చెప్పారు. ముందుగా లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. వచ్చేవారం కీలకమని, టెస్టుల సంఖ్యను పెంచుతామన్నారు.
3లక్షల మందికిపైగా టెస్టులు
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3,19,400 మందికి కరోనా టెస్టులు చేశామని ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ హెడ్ డాక్టర్ రామన్ ఆర్ గంగాఖేడ్కర్ తెలిపారు. గురువారం 28,340 మందికి టెస్టులు చేశామన్నారు. ఐసీఎంఆర్ పరిధిలోని 183 ల్యాబ్స్‌లో 23,932 టెస్టులు, మిగతావి 83 ప్రైవేట్ ల్యాబ్స్ లో చేసినట్లు వివరించారు.
అట్లాగైతే ఆంక్షల్ని సడలించొచ్చు
కంటెయిన్‌మెంట్ జోన్లకు సంబంధించి సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ అప్ డేట్ ప్లాన్ ను ప్రకటించింది. కంటెయిన్ మెంట్ జోన్లలో వరుసగా 28 రోజుల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే ఆయా జోన్లలో ఆంక్షలను సడలించొచ్చని తెలిపింది. ఆ జోన్లలో కన్ఫమ్డ్ కేసు నమోదైన తర్వాత 4 వారాల వరకూ సెకండరీ పాజిటివ్ కేసు నమోదు కాకపోతే ఈ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించింది. అయితే ఆయా జోన్లపై తప్పనిసరిగా నిఘా ఉంచాలంది. ఎవరికైనా శ్వాసకోశ, ఫ్లూ వ్యాధులున్నాయో గుర్తించాలని చెప్పింది. కంటెయిన్‌మెంట్ క్లస్టర్లలో కరోనా వ్యాప్తిని కంట్రోల్చేసేందుకు రాష్ట్రాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.

