మిస్ వరల్డ్ ఈవెంట్తో.. తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ మ్యాప్పై చూపిస్తాం: మంత్రి జూపల్లి

మిస్ వరల్డ్ ఈవెంట్తో.. తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ మ్యాప్పై చూపిస్తాం: మంత్రి జూపల్లి

మిస్ వరల్డ్ ఈవెంట్తో తెలంగాణ టూరిజాన్ని గ్లోబల్ మ్యాప్పైన చూపిస్తామని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు.  మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరుగుతుండటం అదృష్టమని, - తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పొచ్చునని ఈ సందర్భంగా అన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసమే ప్రతిష్టాత్మకంగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

ఈ పోటీలపై కొందరు రాజకీయంగా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలు ఏ కోణంలో చూస్తే అలా కనిపిస్తాయని అన్నారు. ఈ పోటీల కోసం కేవలం  రూ.5 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ ను కూడా తాము తప్పబట్టలేదని, కేవలం అవినీతిని మాత్రమే ప్రశ్నించినట్లు చెప్పారు. 

ప్రెస్ మీట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, మిస్ ఇండియా నందిని గుప్తా, సోనూ సోద్, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ, జయేష్ రంజన్, పటేల్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు మే 7 నుంచి 31వ తేది వరకు జరగనున్నాయి.  మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ నగరం మొదటి సారి ఆతిథ్యమిస్తోంది. 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది. 31న హైటెక్స్ లో ఫైనల్స్ నిర్వహిస్తారు. 

మిస్ వరల్డ్ పోటీలకు 120 దేశాల కంటెస్టెంట్స్ బరిలో దిగుతున్నారు. ఈ పోటీలకు  తెలంగాణ టూరిజం శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పోటీల కోసం హిప్పటికే మిస్ వరల్డ్ సీఇఓ జూలియా మోర్లీ,  మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్, మిస్ బ్రెజిల్ జెస్సికా, మిస్ కెనడా డయాన క్యాథరిన్, మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాత, పోర్చుగల్ కంటెస్టెంట్ మారియా, ఘనా కంటెస్టెంట్ అమాపోకుహా, ఐర్లాండ్ కు చెందిన జాస్మిన్ జెరార్డ్, తదితరులు హైదరబాద్ చేరుకున్నారు.