కరోనా వస్తదన్న టెన్సన్ తో సెల్ఫ్ క్వారంటైన్!

కరోనా వస్తదన్న టెన్సన్ తో సెల్ఫ్ క్వారంటైన్!

హైదరాబాద్, వెలుగు: జ్వరం, దగ్గు, జలుబు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటే కరోనా కావొచ్చన్న సూచనలు ఓవైపు.. పాజిటివ్ వాళ్లతో  ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నా టెస్టులు చేయకపోవడం మరో వైపు జనంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రోజూ ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు, బయట తిరిగే డ్యూటీలు చేస్తున్న వాళయితే  మరీ టెన్షన్ పడుతున్నారు. తమకు కరోనా వచ్చి ఉంటుందా, అది ఇంట్లో వాళ్లకూ సోకుతుందా అనే సందేహంతో.. సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లి పోతున్నా రు. ఫ్యామిలీకి దూరంగా విడిగా ఉంటున్నారు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్న వాళ్లయితే..పాజిటివ్ వ్యక్తులకు హాస్పిటళ్ల ఇస్తున్న మెడికేష ఏంటో తెలుసుకుని ఫాలో అవుతున్నారు. టెస్టులు చేస్తే ఈ భయం ఉండదని వాపోతున్నారు. టెస్టు లు చేయకపోవడంతో.. కరోనా లక్షణాలేమైనా ఉన్నా.. పాజిటివ్ వ్యక్తులను కలిసి ఉన్నా సమాచారం ఇవ్వాలని, టెస్టులు చేయించు కోవాలని మొదట్లో సీఎం కేసీఆర్, డాక్టర్లు అంతా పదే పదే ప్రకటించారు. పాజిటివ్ వ్యక్తుల కాంటాక్ట్ స్ట్రేసింగ్ అంటూ హడావుడి జరిగింది. అనుమానం ఉన్నవాళను తీసుకెళ్లి హాస్పిటళ్లలో ఐసోలేషన్లో పెట్టారు. కానీ తర్వాత పట్టించుకోవడం మానేశారు. పాజిటివ్ వ్యక్తులను కలిశామన్నా, వైరస్ లక్షణాలు ఉన్నాయన్నా టెస్టులు చేయకపోవడంతో  కొందరి ఆందోళన మొదలైంది. అలాంటి వాళ్లంతా సెల్ఫ్ క్వారంటైన్  వెళ్తున్నారు. ఇంట్లో వాళను ఊరికో, ఇతర బంధువుల వద్దకో పంపించి ఒంటరిగా గడుపు తున్నారు. కరోనా ట్రీట్మెంట్ కు సంబంధించి డాక్టర్లు సూచిస్తున్నమెడికేషన్, ఫుడ్, ఇతర సూ చనలను ఇంట్లోనే ఫాలో అవుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరానికి మందులు వేసుకుంటున్నారు. తమకు టెస్టులు చేస్తే అనుమానం, భయం తొలగిపోతాయని.. పాజిటివ్ వస్తే హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటామని వారు అంటున్నారు. నిత్యం టెన్షన్ పడుతున్నామని, రాత్రి నిద్ర కూడా సరిగా పట్టడం లేదని కొందరు బాధగా చెప్తున్నారు.