
టీఎస్పీఎస్సీ నియామకాల తీరుపై అనుమానాలు
మంచిర్యాల, వెలుగు: హిందీ టీచర్లు, పండిట్ల నియామకంలో టీఎస్పీఎస్సీ జీవో నంబర్ 25ను పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేయనివాళ్లు ఈ పోస్టులకు అనర్హులని జీవో చెప్తున్నా టీఎస్పీఎస్సీ అందుకు భిన్నంగా సెలక్షన్స్ చేశారని, ఇందులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. స్కూల్ఎడ్యుకేషన్(జనరల్) డిపార్ట్మెంట్2017 అక్టోబర్10న టీచర్స్ రిక్రూట్మెంట్రూల్స్కు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 25 రిలీజ్ చేసింది. దీని ప్రకారం టీఎస్పీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా158 హిందీ స్కూల్ అసిస్టెంట్, 352 హిందీ లాంగ్వేజ్ పండిట్ పోస్టుల రిక్రూట్మెంట్కోసం ఆ ఏడాది అక్టోబర్ 21న నోటిఫికేషన్ రిలీజ్చేసింది. ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంది. నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ లేకున్నా విద్వాన్, మధ్యమ విశారద సర్టిఫికెట్లతో పీజీ చేసిన అభ్యర్థులు సైతం అప్లై చేసుకున్నారు. అప్లికేషన్స్‌ను స్క్రూటినీ చేసి క్వాలిఫికేషన్ లేనివాళ్లను రిజెక్ట్ చేయాల్సినప్పటికీ పట్టించుకోకుండా అందరికీ హాల్ టికెట్స్ జారీ చేశారు. 2018 ఫిబ్రవరి 28న రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత రిజల్ట్ రిలీజ్ చేశారు.
స్కూల్ అసిస్టెంట్లకు 3,152, లాంగ్వేజ్ పండిట్స్‌కు 4,102 మంది హాజరుకాగా, ఇందులో 50 శాతం మంది విద్వాన్, మధ్యమ విశారద లేదా వాటితో పీజీ చేసినవారే.
రూల్స్‌కు అగెనెస్ట్‌గా సెలక్షన్స్
158 పోస్టులకుగానూ పలు కారణాలతో పదింటిని పక్కనపెట్టి 148 పోస్టులకు 1:3 రేషియో ప్రకారం మెరిట్ అభ్యర్థులను గత ఏడాది అక్టోబర్‌లో సెలెక్ట్ చేశారు. ఈ లిస్టు డీఈవోల దగ్గరకి వచ్చినప్పటికీ వారికి ఇంకా పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారు. రిజెక్టెడ్ లిస్ట్ఇప్పటికీ ప్రకటించకపోవడంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 148 పోస్టులకు విద్వాన్, మధ్యమ విశారదలతో పీజీ చేసినవారు 90 మందికి పైగా సెలెక్ట్ అయినట్టు సమాచారం. హిందీ లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు సర్టిఫికెట్వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి విద్వాన్, మధ్యమ విశారద సర్టిఫికెట్లు గ్రాడ్యుయేషన్‌కు సమానం కాదని, వాటికి యూజీసీ గుర్తింపు లేదని నోటిఫికేషన్లో తొలగించారు. అయినప్పటికీ కనీసం డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ చదవకుండా విద్వాన్, మధ్యమ విశారదలతో పీజీ చేసిన వారిని సెలెక్ట్చేశారు. అదర్ గ్రాడ్యుయేషన్ ఆప్షన్లో డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేదా మూడేళ్ల బీవోఎల్ చేసినవారే అర్హులని మిగతా అభ్యర్థులు పేర్కొంటున్నారు. యూజీసీ 1985/2013/2014 రెగ్యులేషన్స్ ప్రకారం గ్రాడ్యుయేషన్‌లో సెకండ్ లాంగ్వేజ్‌గా హిందీ చదవకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్చేసినా, ఆ డిగ్రీతో యూజీసీ నెట్అర్హత పొందినా చెల్లుబాటు కాదంటున్నారు. అలాగే హిందీ లాంగ్వేజ్పండిట్స్గా పనిచేస్తున్న వారు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ రావడం లేదని పోస్టులకు పోటీపడ్డారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 24 పోస్టులకు గాను 12 మంది వాళ్లే ఉన్నారు.
అర్హులనే సెలక్ట్ చేయాలి
ఇదే నోటిఫికేషన్లో తెలుగు స్కూల్‌అసిస్టెంట్లకు జీవో ఎంఎస్ నంబర్ 25లో పేర్కొన్న క్వాలిఫికేషన్ ప్రకారం అభ్యర్థులను సెలక్ట్ చేసినట్లుగానే హిందీ స్కూల్‌అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని మిగతా అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హెచ్ సీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో రెగ్యులర్‌గా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన, అంబేద్కర్, ఉస్మానియా, కాకతీయ ఓపెన్ యూనివర్సిటీల నుంచి డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ హిందీ సెలక్షన్ లిస్ట్‌ను పునఃపరిశీలన చేసి జీవో 25 ప్రకారం సరైన క్వాలిఫికేషన్స్ కలిగిన అభ్యర్థులను సెలక్ట్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ హిందీ జాక్ ప్రెసిండెంట్ఎం.యాదగిరి, జీవో 25 పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ పి.సత్యనారాయణ డిమాండ్ చేశారు.