‘‘ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ యందు.. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫార్మ్ వేరయా’’: ఈ ప్రశ్న ఎవరినీ అడిగిన.. సమాధానం ‘నెట్‌ఫ్లిక్స్’తోపు అనే వస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చే సినిమాల కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది.
‘‘బలమైన సందేశం’’ఐనా ‘‘ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్’’ ఐన ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది నెట్‌ఫ్లిక్స్ (NETFLIX). తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ తీసుకొస్తుండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.
అయితే, లేటెస్ట్గా నెట్‌ఫ్లిక్స్ లోకి మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వస్తోంది. అదే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (Delhi Crime: Season 3). నిజ జీవిత ఘటనల ఆధారంగా కంటెంట్ తీసుకురావడం ఈ సిరీస్ ప్రత్యేకత. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్గా కంప్లీట్ అయ్యాయి.
ఇవాళ మంగళవారం (2025 నవంబర్ 4) మూడో సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ సారి మరింత ఇంట్రెస్ట్ అంశాలతో వస్తున్నట్టు తెలుస్తోంది. అమ్మాయిల అక్రమ రవాణా చుట్టూ తిరిగే కథలా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇందులో షెఫాలీ షాతోపాటు హుమా ఖురేషీ, రసికా దుగల్, రాజేష్ తైలాంగ్ లాంటి వాళ్లు నటించారు. ఢిల్లీ క్రైమ్ మూడో సీజన్ నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.
Har jurm ka jawaab, kanoon se milega. Madam Sir is back.
— Netflix India (@NetflixIndia) November 3, 2025
Delhi Crime Season 3 trailer out tomorrow. #DelhiCrimeS3OnNetflix pic.twitter.com/Aanj8Y8E1k
ఢిల్లీ క్రైమ్ సీజన్ 1:
2012లో భారతదేశాన్ని కదిలించిన నిర్భయ రేప్ కేసు ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2019లో వచ్చింది.
ALSO READ : రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ అప్డేట్..
ఢిల్లీ క్రైమ్’ సీజన్ 2:
2022లో DCP వర్తిక చతుర్వేది నేతృత్వంలోని పోలీసు బృందం నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక నేర సిండికేట్‌ను ఎలా ఛేదిస్తుందో వివరిస్తుంది. అంటే.. కచ్చా బనియన్ గ్యాంగ్ ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఇంట్లోని ఒంటరి ముసలివాళ్లనే లక్ష్యంగా చేసుకొని వాళ్లు చేసే దాడులు, కేసు ఎలా పరిష్కారమైందన్నది చూపించారు. మొత్తం ఈ రెండు సీజన్లలో 12 ఎపిసోడ్లు వచ్చాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్నాయి. సీజన్ 3 వచ్చేలోపు.. సీజన్ 1, 2 లు చూసేయండి.
