
కామారెడ్డి జిల్లా కి చెందిన భూమ్ భాయ్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చనిపోయాడు. అయితే..పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడంటూ భూమ్ భార్య ఆరోపిస్తోంది. ఈ నెల 4వ (దీపావళి) తేదీన బిచ్కుంద మండలం శాంతపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని వారిని చితక్కొట్టారు. పోలీసులు కొట్టడంతో భూమ్ తీవ్రంగా గాయపడ్డాడు.
గాయపడిన భూమ్ భాయ్ ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు..అయితే ఆస్పత్రి డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించేందుకు నిరాకరించడంతో గాంధీకి తరలించారు. చికిత్స పొందుతూ గాంధీలో ఈ నెల 9న మృతి చెందాడు భూమ్ భాయ్. నా భర్తను పోలీసులు కొట్టడం కారణంగానే చనిపోయడాని ఆరోపించింది. భర్తను కొట్టిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు లెటర్ రాసింది భార్య లచ్చవ్వ. భూమ్ భాయ్ చనిపోయి మూడు రోజులు అయినా తమకు డెడ్ బాడీ ఇవ్వట్లేదని తెలిపారు బంధువులు.
అనారోగ్య కారణాలతో చనిపోయాడని లెటర్ తీసుకొచ్చిన పోలీసులు... ఆ లెటర్ పై సంతకం పెడితేనే డెడ్ బాడీ ఇస్తామని పోలీసులు చెబుతున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలిపినా..ఎవరూ స్పందించడం లేదంటున్నారు.