ఆదిలాబాద్ జిల్లాలో లేని ప్లాట్ ను అమ్మి మోసగించిన మహిళ అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లాలో లేని ప్లాట్ ను అమ్మి మోసగించిన మహిళ అరెస్ట్
  • బాధిత దంపతుల నుంచి రూ. 3.30 లక్షలు వసూలు

ఆదిలాబాద్, వెలుగు : లేని ప్లాట్ కు డాక్యుమెంట్లు తయారు చేసి విక్రయించిన కేసులో మహిళను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సీఐ ఫణిధర్ తెలిపిన ప్రకారం.. ఆదిలాబాద్ టౌన్ లోని బృందావన్ కాలనీకి చెందిన దాసరి జ్యోతి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌‌ గా చేస్తుంది. ఖానాపూర్ శివారు సర్వే నంబర్ 68/100/2లో నం. 764 ప్లాటును అమ్మేందుకు 2022లో గెడం దేవిదాస్, జ్యోత్స్నదంపతుల వద్ద రూ. 3.30 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 

అయితే.. ఆమె మరో వ్యక్తి మహమ్మద్ కలీమ్ తో కలిసి లేని ప్లాట్ కు తన పేరు మీద ఫేక్ డాక్యుమెంట్​సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఇది తెలిసిన బాధిత దంపతులు నిలదీయగా  ఆమె తప్పించుకొని తిరుగుతుంది. దీంతో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ తెలిపారు.