ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని.. 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు

ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని.. 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు

శంషాబాద్, వెలుగు: తాను ప్రేమించిన యువకుడు రిజెక్ట్​ చేయడంతో ఓ యువతి అతడిపై కోపం పెంచుకుంది. అతడిని ఎలాగైనా పెద్ద సమస్యలో ఇరికించాలని డిసైడ్​ అయింది. ప్రియుడి పేరుతో మెయిల్​ ఐడీ క్రియేట్​ చేసి 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులకు పాల్పడింది. ఆ యువతిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 శంషాబాద్​ ఎయిర్​పోర్టు అధికారులు తెలిపిన ప్రకారం.. చెన్నై కి చెందిన రెనే జోషిల్డా అనే యువతి చెన్నైలోని డెలాయిట్​లో సీనియర్ కన్సల్టెంట్​గా పనిచేస్తుంది. కొలిగ్​ దివేజ్ ప్రభాకర్ ను ప్రేమించింది. అతడు నిరాకరించడంతో కక్ష పెంచుకుంది. ఆయన పేరుతో మెయిల్​ ఐడీ క్రియేట్​ చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్​ మధ్య 12 రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్స్​ పంపింది. ఆమె నుంచి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టుకు కూడా రెండుసార్లు బెదిరింపు మెయిల్స్​ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.