హిస్టరీ క్రియేట్ చేసిన సిక్కు మహిళ అన్మోల్ నారంగ్

హిస్టరీ క్రియేట్ చేసిన సిక్కు మహిళ అన్మోల్ నారంగ్

వాషింగ్టన్: ప్రతిష్టాత్మక యూఎస్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తొలి సిక్కు విమెన్‌గా రెండో లెఫ్టినెంట్ అన్మోల్ నారంగ్ శనివారం హిస్టరీ క్రియేట్ చేయనుంది. వెస్ట్‌ పాయింట్‌లోని యూఎస్ మిలటరీ అకాడమీలో పాల్గొననున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు. వెస్ట్ పాయింట్‌లో గ్రాడ్యుయేషన్ చేయాలనే తన కోరికను తీర్చుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని అన్మోల్ ఓ ప్రకటనలో తెలిపింది.

‘జార్జియాలోని ఇంటికి తిరిగొచ్చిన తర్వాత నా కమ్యూనిటీ ఇచ్చిన సపోర్ట్‌, కాన్ఫిడెన్స్‌ నాకు చాలా అర్థవంతంగా అనిపించాయి. నా గోల్‌ను చేరుకుంటున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. దీని ద్వారా సవాళ్లను ఎదుర్కోవడానికి ఇష్టపడే సిక్ అమెరికన్స్‌కు ఏదైనా సాధ్యమేనని నేను నిరూపించాన’ ని అన్మోల్ చెప్పింది. అన్మోల్ నారంగ్ బేసిక్ ఆఫీసర్ లీడర్‌‌షిప్ కోర్సును ఓక్లహామా, లాటన్‌లోని ఫోర్ట్‌ సిల్‌లో చదవనుంది. ఆ తర్వాత బీఓఎల్‌సీ కోర్సును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేస్తే జపాన్‌లోని ఓకినావాలో వచ్చే ఏడాది ఆమెకు ఫస్ట్‌ పోస్టింగ్‌ ఇచ్చే అవకాశం ఉంది.