పుల్కల్, వెలుగు: అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన పుల్కల్ పీఎస్పరిధిలో శనివారం జరిగింది. ఏఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం.. వట్పల్లి మండలంలోని బిజిలీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి (26)ని 20 నెలల కింద పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేటకు చెందిన పట్నం ప్రవీణ్కిచ్చి వివాహం చేశారు.
రూ. 9 లక్షల నగదు, బంగారం, ఇతర సామగ్రి వరకట్నంగా ఇచ్చారు. 4 నెలల అనంతరం అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తమామలు లక్ష్మిని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరడంతో తల్లి అంబమ్మ వచ్చి పుట్టింటికి తీసుకువెళ్లింది.
3 నెలల తర్వాత భర్త ప్రవీణ్ బాగా చూసుకుంటానని చెప్పి కాపురానికి తీసుకువెళ్లాడు. శనివారం భర్త, అత్తమామలు ముగ్గురు కలిసి లక్ష్మిని మళ్లీ చిత్రహింసలకు గురి చేయడంతో ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుంది. గమనించిన భర్త ప్రవీణ్ స్థానికుల సాయంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.
మృతురాలికి 10 నెలల పాప ఉంది. తల్లి అంబమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్ కూమార్ తెలిపారు.
