
ఆదిలాబాద్, ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వివాహిత స్వప్న(30) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై భవానీసేన్‌గౌడ్ కథనం ప్రకారం.. స్వప్నకు ఆరేళ్ల క్రితం నిజామాబాద్‌కు చెందిన ప్రశాంత్‌తో పెళ్లైంది. అయితే.. పెళ్లయి ఆరేళ్లయినా సంతానం కలగకపోవడంతో కొన్నిరోజులుగా ఆమె దిగులుతో ఉంది. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.