
మేడ్చల్ జిల్లా : వివాహిత సూసైడ్ చేసుకున్న సంఘటన సోమవారం తెల్లవారుజామున కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాంపల్లిలో త్రినేయని(20) అనే మహిళ అత్తవారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రినేయనిని ఏడు నెలల క్రితం అక్షయ్ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అక్షయ్ వేధింపులు తట్టుకోలేకనే త్రినేయని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు మృతిరాలి తల్లిదండ్రులు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు కీసర పోలీసులు.