రైలులో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

రైలులో ప్రసవం.. తల్లి, బిడ్డ క్షేమం

గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్రకు చెందిన సీతాదేవి రైలులో ప్రయాణిస్తూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సీతాదేవి కుటుంబ సభ్యులతో కలిసి గూడూరు వద్ద బాగామతి ఎక్స్​ప్రెస్​ ఎక్కింది. ట్రైన్​ వరంగల్​ స్టేషన్​ దాటిన తర్వాత పురిటి నొప్పులు అధికం కావడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెకు పురుడు పోశారు.

ట్రైన్​ రామగుండం రైల్వే స్టేషన్​కు చేరుకోగానే, 108లో ఈఎంటీ రవి, పైలట్​ అనిల్​ తల్లి, బిడ్డకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వారిని గోదావరిఖని గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.