
డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారే రోజులు ఇవి. డబ్బు కోసం సొంతవారిని సైతం చంపుతున్నవారు ఎక్కువవుతున్నారు. ఇటీవల కాలంలో జరిగిన చాలావరకు హత్యలకు కారణం ఆర్థిక వ్యవహారాలే కారణంగా ఉంటున్నాయి. కేరళలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహిళను కారుతో గుద్ది చంపిన ఘటన కేరళలోని వెట్టికావుంగల్ లో కలకలం రేపింది. హత్యగా అనుమానిస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ( మే 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
కేరళలోని వెట్టికావుంగల్ లోని పూవన్పరలో అద్దె ఇంట్లో ఉంటున్న 36 ఏళ్ళ నీతూ కృష్ణన్ మంగళవారం ( మే 6 ) మృతి చెందింది. చంగనస్సేరిలోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నీతు మంగళవారం ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళుతుండగా వెట్టికావుంగల్-పూవన్పర్తపడి రహదారిపై జరిగిన ప్రమాదంలో మరణించింది. వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొని అపస్మారక స్థితిలో ఉన్న నీతును స్థానికులు కరుకాచల్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు.
వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలం నుంచి మల్లపల్లి వైపు కారు వెళ్తున్నట్లు గమనించామని తెలిపారు స్థానికులు. స్థానికుల సంచారంతో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.ఇటీవల కాలంలో నీతూకి సంబంధించి న ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు దారి తీశాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.