కామారెడ్డిలో కుక్క కాటుకు మహిళ మృతి

కామారెడ్డిలో కుక్క కాటుకు మహిళ మృతి

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పిచ్చికుక్క కాటుకు మహిళ మృతి చెందింది. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన చింపాల్ల రేణమ్మ (38) అనే మహిళ గత 15 రోజుల క్రితం వాకిలి ఊడుస్తుండగా కుక్క మొహంపై కరిచింది. చికిత్స కోసం ఆమెను వెంటనే  హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.  చికిత్స పొందుతున్న రేణమన్న మే 23న  మధ్యానం మృతి చెందింది మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు దేవిక, దివ్య  సంధిప్ అనే కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. గ్రామంలో వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు. 

రాష్ట్రంలో వీధి కుక్కల దాడి రోజురోజుకు పెరుగుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయి. అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారే తప్ప కుక్కల నివారణకు చర్యలు చేపట్టడం లేదు.