మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలో..ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ మహిళ మృతి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలో..ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ మహిళ మృతి
  •  మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పరిధిలోప్రమాదం

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్​జిల్లా తొర్రూరులో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి దూసుకెళ్లడంతో మహిళ చనిపోయింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. సోమవారం వరంగల్​నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి తొర్రూరు మండలం నాంచారి మడూరులో రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లింది.

 గోడ కూలి సెంట్రింగ్​ బాక్సులు, కర్రలు ఇంటి ముందు నిల్చున తాండూరి లక్ష్మి(45)తలపై పడడంతో తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని స్థానికులు వరంగల్​కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలి బంధువు కర్రె నారాయణరెడ్డి ఫిర్యాదుతో లారీ డ్రైవర్​నవాబ్​పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.