ఓప్రైవేట్ హాస్పిటల్ లో సంఘటన
పోలీసుల అదుపులో ముగ్గురు అటెండర్లు
హైదరాబాద్, వెలుగు: ఓ మహిళ కరోనాతో చనిపోతే, ఆమె ఒంటి పైనున్న నగలను కొట్టేశారు. హైదరాబాద్ లోని కింగ్‌కోఠికి చెందిన ఓ మహిళ కరోనా లక్షణాలతో జులై 23న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ ఫేమస్ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది. ట్రీట్ మెంట్ తీసుకుంటూ అదే నెల 25న అరరాత్రి 12:30 గ ్ధ ంటలకు మరణించింది. హాస్పిటల్ సిబ్బంది డెడ్ బాడీని ప్యాక్ చేసి అంత్యక్రియలకు పంపించారు. 26న అంత్యక్రియలు నిర్వహించగా, ఆమె ఒంటిపై ఉండాల్సిన దాదాపు రూ.4లక్షల విలువ చేసే చెవి కమ్మలు, ముక్కు పుడక, చైన్ కనిపించలేదు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ మేనేజ్ మెంట్ ను ప్రశ్నించగా, నగల గురించి తమకేంతెలియదని చెప్పింది.
దీంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌పోలీసులకు కంప్లయింట్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు డెడ్ బాడీని ప్యాక్ చేసే
సమయంలో హాస్పిటల్ సిబ్బందే నగలను కొట్టేసినట్లుగా అనుమానిస్తున్నారు. ముగ్గురు అటెండర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.

