
కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నీటి సంపులో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఓ మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. బౌరంపేట్ స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు.. సంపు నుండి మృతదేహాన్ని వెలికి తీశారు. మహిళను బండరాయితో మోది హత్యచేసి ఈడ్చికెళ్ళి సంపులో పారవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మృతురాలు స్థానికంగా గండిమైసమ్మలో అడ్డా కూలీగా నివాసం ఉండే లంబాడి సక్కుబాయి(44) గుర్తించారు.
మృతురాలి చిన్న కుమారుడు శేఖర్ పిర్యాదుతో కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నామని దుండిగల్ పోలీసులు తెలిపారు. కొన్ని చెడు అలవాట్లే.. ఆమె మృతికి కారణం అయ్యి ఉంటుందని.. ఆమె కుటుంబ సభ్యులే పరువు పోతుందని ఈ దారుణనికి ఒడి గట్టి నీటి గుంతలో పడేశారా అనే కోణంలో దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.