చింపాంజీ వేషం కట్టి.. కోతుల భరతం పట్టి..

చింపాంజీ వేషం కట్టి.. కోతుల భరతం పట్టి..

వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్: కోతుల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు ఓ మహిళా రైతు వినూత్న ఆలోచన చేశారు. మహేశ్వరం గ్రామానికి చెందిన భూక్యా రాధ రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేసింది. 

కాపు దశకు రాగానే కోతుల దండు వచ్చి చేనును పాడుచేయడంతో తీవ్రంగా నష్టపోయింది. దీంతో కోతులకు చెక్​ పెట్టాలని భావించి ఆన్‌‌లైన్ లో రూ.2 వేలతో చింపాంజీ డ్రెస్​ తెప్పించుకుంది. చింపాంజీ వేషధారణలో పొలంలో తిరుగుతూ కోతులను తరుముతోంది.