నెలలు నిండి నొప్పులు పడుతున్న నిండు గర్భిణికి రైల్వే స్టేషన్ లో పురుడు పోశాడు ఓ రైల్వే డాక్టర్. ఈ ఘటన మహారాష్ట్ర లోని పన్వెల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. గర్బంతో ఉన్న ఓ మహిళ గురువారం పొద్దున నేరూల్ నుంచి పన్వెల్ కు వెళ్లింది. అయితే నొప్పులు రావడంతో రైల్వే స్టేషన్ లోనే కుప్పకూలింది. అక్కడే డ్యూటీలో ఉన్న రైల్వే డాక్టర్ ఆ మహిళ పరిస్థితిని గమనించి.. స్టేషన్ లోనే పురుడు పోశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు.
రైల్వే శాఖ నిర్వహిస్తున్న ఒక్క రూపాయి క్లినిక్ లో మహిళ పురుడు పోసుకుంది. సాధారణంగా ప్రయాణికులకు ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలపై అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ వన్ రుపీ క్లీనిక్ లను నిర్వహిస్తుంది. ఈ హాస్పిటల్ లో ఓ మహిళ పురుడుపోసుకోవడంతో నెటిజన్లు డాక్టర్ ను మెచ్చుకుంటున్నారు.
Maharashtra: A woman, travelling from Nerul to Panvel, gave birth to a child at Panvel railway station earlier this morning, with the help of a doctor of Railway's One Rupee Clinic and the railway staff. The mother and the child are healthy and have been shifted to a hospital. pic.twitter.com/8v0cTTypbb
— ANI (@ANI) November 21, 2019
